క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన మాస్ మహారాజ్
జయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజ్ రవితేజ వరుసపెట్టి సినిమాలను చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2025 5:00 PM ISTజయాపజయాలతో సంబంధం లేకుండా మాస్ మహారాజ్ రవితేజ వరుసపెట్టి సినిమాలను చేస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. వాస్తవానికి రవితేజ- భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ జాతర సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ అవాల్సింది కానీ ఇప్పుడా సినిమా ఆగస్ట్ నుంచి వాయిదా పడిందని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.
రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చేస్తున్న రవితేజ ఈ ఇయర్ ఎండింగ్ కు ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. కిషోర్ తిరుమల సినిమా తర్వాత రవితేజ నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ఓ రెండు కొత్త సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రవితేజ నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఖుషి సినిమా ఫ్లాపవడంతో శివ నిర్వాణ తన తర్వాతి సినిమా హీరో విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తానికి తన కథతో మాస్ మహారాజ్ ను మెప్పించిన శివ, ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ లో చేయనున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలవనుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
శివ నిర్వాణ సినిమాతో పాటూ రవితేజ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టారని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్ తో రవితేజ ఓ ఇంట్రెస్టింగ్ మూవీ చేయడానికి ఒప్పుకున్నారట. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తో రవితేజ సినిమా గత కొంత కాలంగా చర్చల్లో ఉండగా ఇప్పుడు ఆ సినిమా ఓకే అయినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. రవితేజ ఈ రెండు సినిమాలనూ నెక్ట్స్ ఇయర్ లోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
