రవితేజ-శివ కాంబినేషన్ నేపథ్యమదా?
మాస్ రాజా రవితేజ మళ్లీ క్లాస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. మాస్ అటెంప్ట్ లు ఫెయిల్ అయ్యే సరికి రూట్ మార్చి కొత్తగా ముందుకెళ్తున్నాడు.
By: Srikanth Kontham | 9 Jan 2026 11:00 PM ISTమాస్ రాజా రవితేజ మళ్లీ క్లాస్ బాట పట్టిన సంగతి తెలిసిందే. మాస్ అటెంప్ట్ లు ఫెయిల్ అయ్యే సరికి రూట్ మార్చి కొత్తగా ముందుకెళ్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమాకు ప్రచార చిత్రాలే మంచి బజ్ ను తీసుకొచ్చాయి. ఇప్పటికే సంక్రాంతి రేస్ నుంచి ఓ సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయం. కుటుంబ అనుబంధం, భావోద్వేగాన్ని హైలైట్ చేస్తూ కిషోర్ తిరుమల చేసిన చిత్రమిది.
ఈ సినిమా రిలీజ్ అనంతరం రవితేజ తదుపరి సినిమా కూడా మరో క్లాసిక్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయింది. అధికారికంగా విషయం ఇంకా బయటకు రాలేదు గానీ, లాక్ అయిందని గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమా నేపథ్యం ఏంటి? అన్నది ఇంకా లీక్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది తండ్రీ-కూతుళ్ల కథగా వినిపిస్తోంది. ఇదే కథకు క్రైమ్ థ్రిల్లర్ అంశాన్ని జోడించి తెరకెక్కించబోతున్నాడని దర్శక వర్గాల నుంచి తెలిసింది. క్రైమ్ థ్రిల్లర్ అంటే రవితేజకు కొత్తేం కాదు.
ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు చేసాడు. కానీ శివ నిర్వాణకు మాత్రం కొత్త ప్రయత్నమనే చెప్పాలి. ఇప్పటి వరకూ శివ కేవలం క్లాసిక్ లవ్ స్టోరీలు మాత్రమే డీల్ చేసాడు. తన ప్రేమ కథని తెలివిగా ఎమోషన్ తో ప్రేక్షకులకు కనెక్ట్ చేసాడు. 'ఖుషీ' సహా అదే ప్యాట్రన్ లో సాగినా డివైడ్ టాక్ తో బయట పడింది. నానితో 'టక్ జగదీష్' అంటూ యక్షన్ డ్రామా ప్రయత్నించాడు కానీ ఫలించలేదు. ఈ జానర్ శివకు పూర్తిగా కొత్త. మరి తండ్రీ కూతుళ్ల క్రైమ్ థ్రిల్లర్ల కథని శివ ఎంత కొత్తగా చూపిస్తాడు? అన్నది ఆసక్తికరం. కుమార్తె సెంటిమెంట్ రవితేజకు బాగా కలిసొచ్చిన పాయింట్.
'విక్రమార్కుడు' లో తండ్రి-కూతురు బాండింగ్ ఎంతగా వర్కౌట్ అయిందో తెలిసిందే. అందులో యాక్షన్ సన్నివేశాలు ఎంత గొప్పగా పండుతాయో? అంతకు మించి రవితేజతో కూమార్తె బాండింగ్ సన్నివేశాలు అంతకు మంచి అందంగా పండాయి. ఆ సన్నివేశాలు రక్తి కట్టించాయి. ఆ తర్వాత మళ్లీ రవితేజ ఆ నేపథ్యంలో మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇంత కాలానికి శివ నిర్వాణ అదే బాండింగ్ ని ఎంచుకోవడం ఇంట్రెస్టింగ్.
