మాస్ మహారాజా - శివ నిర్వాణ సడన్ సర్ ప్రైజ్
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు.
By: M Prashanth | 25 Jan 2026 11:17 AM ISTమాస్ మహారాజా రవితేజ ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో స్పీడ్ గా వెళుతున్నాడు. ఇటీవల సంక్రాంతి కానుకగా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరికొత్త కంటెంట్ తో మెప్పించే ప్రయత్నం మాత్రం చేశారు. లేటెస్ట్ గా తన స్పీడ్ ని ఏమాత్రం తగ్గించకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రవితేజ.
రవితేజ తన 77వ సినిమా కోసం సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో కలవడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి ఎమోషనల్ హిట్లతో పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ.. మాస్ రాజాను ఎలా ప్రెజెంట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ అవ్వగానే ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమా ద్వారా రవితేజ తన కెరీర్ లో మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నారు. కాన్సెప్ట్ ఎలా ఉంటబోతోంది అనేది రేపు తెలుస్తుంది.. అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఈ అప్‌డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పోస్టర్ చూస్తుంటే ఇది ఒక సీరియస్ ఎమోషనల్ డ్రామాగా ఉండబోతోందని అర్థమవుతోంది. నది తీరంలో ఆరేసిన బట్టలు.. చీకటి వాతావరణం సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.
ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని.. రవిశంకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కు రవితేజ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం. మాస్ సినిమాలకే పరిమితం కాకుండా ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న దర్శకుడితో రవితేజ పనిచేయడం కొత్తగా ఉంటుందనే చెప్పాలి.
నేటి జనరేషన్ ఆడియన్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. కేవలం ఫైట్లు.. డైలాగులే కాకుండా మనసుకు హత్తుకునే కథలు ఉంటేనే థియేటర్లకు క్యూ కడుతున్నారు. శివ నిర్వాణ కథలో ఉండే డెప్త్ రవితేజ లాంటి నటుడికి దొరికితే ఒక పర్ఫెక్ట్ సినిమా వచ్చే అవకాశం ఉంది. RT77 తో రవితేజ తన మార్కెట్ రేంజ్ ని మరింత పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో ఏ రేంజ్ లో ఉండబోతోందో రేపు రాబోయే ఫస్ట్ లుక్ తో క్లారిటీ రానుంది.
