మళ్లీ స్పీడ్ పెంచుతున్న మాస్ రాజా!
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Oct 2025 3:10 PM ISTటాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక్క మూవీ తర్వాత మరొకటి లైన్ లో పెడుతున్నారు. కంటిన్యూ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, హిట్ ను అందుకోలేకపోయారు.
ఇప్పుడు మాస్ జాతర మూవీతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాతో అక్టోబర్ 31న థియేటర్స్ లోకి రానున్నారు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే.. నేను శైలజ, చిత్రలహరి వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను అనౌన్స్ చేశారు.
రవితేజ కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. పర్ఫెక్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా RT 76 ప్రాజెక్ట్ రూపొందుతోంది. 2026 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తుండగా.. మేకర్స్ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అది కూడా ఎలాంటి సౌండ్ లేకుండా కానిస్తున్నారు.
స్పెయిన్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుండగా.. మరికొద్ది రోజుల్లో ఆ షెడ్యూల్ కంప్లీట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపనున్నారు. మాస్ జాతర రిలీజ్ తర్వాత రవితేజ ప్రమోషన్స్ ను నవంబర్ లో మొదలుపెట్టనున్నారు.
అలా మళ్లీ రవితేజ స్పీడ్ పెంచుతున్నారని సమాచారం. ఏదేమైనా RT 76 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా అన్ని పనులను మేకర్స్ ప్లాన్ ప్రకారం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో సినిమా అవుట్ పుట్ బాగా వస్తుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రవితేజ నుంచి మరో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అని వినికిడి.
ఇక సినిమా విషయానికొస్తే.. అత్యంత భారీ బడ్జెట్ తో SLV సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ను ఇటీవల ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది.
