రవితేజ ప్లాన్ మార్చేశారా?
టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇప్పుడు వరుస ఫ్లాపుల తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 13 Feb 2026 1:22 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఇప్పుడు వరుస ఫ్లాపుల తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా ఆయన నటిస్తున్న సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడకపోవడంతో.. ఇకపై భారీ బడ్జెట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా మూవీలు చేయాలని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం రవితేజ రెమ్యూనరేషన్ రేంజ్ సుమారు రూ.20- 25 కోట్ల మధ్య ఉందని వినికిడి. దీంతో సినిమా మొత్తం బడ్జెట్ రూ.40- 50 కోట్లకు చేరుతుందట. ప్రమోషనల్ కార్యక్రమాలు సహా ఇతర ఖర్చులు కలిస్తే బడ్జెట్ మరింత పెరుగుతోందని టాక్. అలా ఒకవేళ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల దాకా వెళ్తే ప్రాజెక్ట్.. ఫైనాన్షియల్ డేంజర్ లో పడే అవకాశం ఉందని నిర్మాతలు అంచనా వేస్తున్నారట.
అందుకే కొత్త సినిమాల విషయంలో వారు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర తర్వాత దర్శకుడు వశిష్ట రవితేజతో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పటికీ, బడ్జెట్ లిమిట్స్ కారణంగా అది ముందుకు సాగడం లేదని సమాచారం. కథపై అందరికీ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ, భారీ బడ్జెట్ కు నిర్మాతలు సిద్ధంగా లేకపోవడం అందుకు కారణంగా తెలుస్తోంది.
అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ల ప్రభావం కూడా సినీ ఇండస్ట్రీపై పడుతుందనే చెప్పాలి. గతంలో డిజిటల్ రైట్స్ ద్వారా పెద్ద మొత్తంలో రికవరీ ఈజీ అయ్యేది. కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో డీల్స్ ఖరారు అవ్వకపోవడంతో థియేటర్ కలెక్షన్లపైనే మొత్తం ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా ఫ్లాప్ అయితే నష్టాలు ఎక్కువ అవుతాయనే భయంతో నిర్మాతలు పెద్ద బడ్జెట్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
అందుకే రవితేజ తన పేమెంట్ విధానాన్ని మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ తగ్గించి, సినిమా లాభాల్లో వాటా తీసుకునే షేర్ మోడల్ కు మారుతున్నారట. ఇలా చేస్తే నిర్మాతలపై భారం తగ్గి, సినిమా విజయం సాధిస్తే ఇద్దరికీ ప్రాఫిట్స్ అనే ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన డిసెషన్ కు ఇప్పుడు అనేక మంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.
కేవలం రవితేజ మాత్రమే కాదు, మరికొందరు హీరోల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం రవితేజకు మద్దతుగా నిలుస్తున్నారు. సాలిడ్ స్టోరీ, సరైన కంటెంట్, కంట్రోల్డ్ బడ్జెట్ ఉంటే మాస్ మహారాజా మళ్లీ బ్లాక్ బస్టర్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ప్లాన్ మార్చుకుని ముందుకెళ్తున్న రవితేజకు ఇకపై ఎలాంటి హిట్స్ దక్కుతాయో వేచి చూడాలి.
