రవితేజ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు..?
మాస్ మహరాజ్ రవితేజ నుంచి రీసెంట్ గా వచ్చిన మాస్న్ జాతర సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
By: Ramesh Boddu | 8 Nov 2025 11:28 AM ISTమాస్ మహరాజ్ రవితేజ నుంచి రీసెంట్ గా వచ్చిన మాస్న్ జాతర సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సినిమాలో మాస్ కంటెంట్ ఓకే అనేలా ఉన్నా రొటీన్ కమర్షియల్ కథ అవ్వడంతో ఆడియన్స్ పెదవి విరిచేశారు. సితార బ్యానర్ కి ఈ మధ్య బ్యాడ్ లక్ వెంటాడుతుండగా మాస్ జాతరతో మరో ఫ్లాప్ ఆ ప్రొడక్షన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఐతే రవితేజ ఇక నెక్స్ట్ సినిమాల విషయంలో కాస్త జాగ్రత్త పడాలని చూస్తున్నారు. రవితేజ కమర్షియల్ సినిమా చేస్తే ఎప్పుడు కూడా డిజప్పాయింట్ చేయలేదు. మాస్ జాతర రిజల్ట్ చూసి మాస్ రాజా కూడా షాక్ లో ఉన్నారని తెలుస్తుంది.
రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్లో సినిమా..
అందుకే కమర్షియాలిటీలోనే కొత్త కథలు చెప్పాలని చూస్తున్నారు. అందులో కూడా తన ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ తో పాటు కిషోర్ తిరుమల టచ్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుందట. ఈ సినిమాతో రవితేజ కచ్చితంగా బౌన్స్ బ్యాక్ ఇస్తారని అంటున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ నెక్స్ట్ శివ నిర్వాణతో సినిమా చేసే ప్లాన్ ఉందట.
అతనే కాదు మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ కూడా రవితేజతో సినిమాకు సై అనేస్తున్నాడు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ సినిమాల ప్లానింగ్ ఉంది. ఐతే లేటెస్ట్ గా రవితేజ తన రెమ్యునరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గినట్టు టాక్. మొన్నటిదాకా పాతిక కోట్లు ఇస్తేనే సినిమా అని చెప్పిన రవితేజ ఇప్పుడు 20 కోట్లు అది కూడా ప్రాఫిట్ షేర్ అంటున్నాడట.
రవితేజలో కూడా మార్పు..
వరుస ఫ్లాపులు రవితేజలో కూడా మార్పు తెచ్చాయని చెప్పొచ్చు. రవితేజ నెక్స్ట్ సినిమా హిట్ ట్రాక్ ఎక్కితే ఓకే కానీ అది కూడా మిస్ ఫైర్ అయితే మాత్రం కెరీర్ మరింత రిస్క్ లో పడినట్టే అవుతుంది. రవితేజ ఫ్యాన్స్ అతని కంబ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కానీ మాస్ రాజాకి ఎలాంటి సినిమా తీసి ఫ్యాన్స్ ని మెప్పించాలి అన్నది అర్ధం కావట్లేదు. మరి రవితేజ నెక్స్ట్ ఏం చేస్తాడు ఎలాంటి సినిమాలతో వస్తాడు అన్నది చూడాలి.
రవితేజ మాస్ హిట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఐతే ఇదివరకు మాస్ సినిమాలు వర్క్ అవుట్ అవ్వట్లేదు. మాస్ కమర్షియల్ సినిమాలైనా కూడా అందులో కథ ఉంటేనే ఆడియన్స్ చూస్తున్నారు. ఐతే రవితేజ నెక్స్ట్ సినిమాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది. మరి మాస్ రాజా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి.
