Begin typing your search above and press return to search.

రవితేజ ఫస్ట్ టైం అలాంటి అటెంప్ట్..?

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారని

By:  Ramesh Boddu   |   1 Jan 2026 12:31 PM IST
రవితేజ ఫస్ట్ టైం అలాంటి అటెంప్ట్..?
X

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన మాస్ జాతర కూడా డిజప్పాయింట్ చేసింది. ఐతే సంక్రాంతికి రాబోతున్న భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మాత్రం తన మార్క్ హిట్ కొట్టాలని చూస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ లు హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తుంది.

టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో..

ఇక ఈ సినిమా తర్వాత రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ శివ నిర్వాణతో ఒక సినిమా లాక్ అయ్యిందన్న టాక్ వచ్చింది. ఆ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. ఐతే వివేక్ ఆత్రేయ తో మాత్రం రవితేజ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. రవితేజ కోసం వివేక్ ఒక హర్రర్ సబ్జెక్ట్ రాసుకున్నాడట. మాస్ రాజాకి కథ వినిపించడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.

నానితో సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి హర్రర్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం ఈ సినిమాలన్నీ కూడా వివేక్ లోని టాలెంట్ ని తెలిసేలా చేశాయి. ఐతే ఈ డైరెక్టర్ హర్రర్ సినిమాలు కూడా తీయగలడు అని ప్రూవ్ చేసుకునేందుకు ఆ అటెంప్ట్ చేస్తున్నారట.

రవితేజ రెగ్యులర్ మాస్ పంథా..

రవితేజ కూడా ఇన్నేళ్ల తన కెరీర్ లో హర్రర్ సినిమాలు చేయలేదు. షాక్ లాంటి సినిమా లవ్ స్టోరీ విత్ సస్పెన్స్ థ్రిల్ ఇచ్చారు. ఐతే పూర్తిస్థాయి హర్రర్ అటెంప్ట్ చేయలేదు. వివేక్ తో రవితేజ కచ్చితంగా ఒక డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతున్నారని తెలుస్తుంది. కొత్తగా ట్రై చేస్తేనే కానీ వర్క్ అవుట్ అవ్వట్లేదని మేకర్స్ గుర్తించారు. అందుకే మూస థోరణికి గుడ్ బై చెప్పి కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు.

రవితేజ కూడా తన రెగ్యులర్ మాస్ పంథా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చి వెరైటీ స్టోరీస్ తో సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నారు. వివేక్ తో హర్రర్, శివ నిర్వాణతో క్రైమ్ స్టోరీ కూడా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ధమాకా తర్వాత సరైన సక్సెస్ ఫుల్ సినిమా లేక కాస్త వెనకపడిన మాస్ రాజాకి ఈ కొత్త అటెంప్ట్ ఏమేరకు పాజిటివ్ రిజల్ట్ అందిస్తాయన్నది చూడాలి. మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తే చూడాలని కోరుతున్నారు.