Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌కు చెక్ పెడుతోన్న ర‌వితేజ‌!

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో తెలిసిందే. గత కొంతకాలంగా రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందించలేదు.

By:  Srikanth Kontham   |   13 May 2026 11:00 PM IST
సీనియ‌ర్ల‌కు చెక్ పెడుతోన్న ర‌వితేజ‌!
X

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ఎలాంటి ఫేజ్ లో ఉన్నారో తెలిసిందే. గత కొంతకాలంగా రవితేజ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందించలేదు. వరుసగా ఆరు పరాజయాలను చవిచూడటంతో రవితేజ సినిమా ఎంపికలో పంథాను పూర్తిగా మార్చుకుంటున్నారు. ఇకపై సీనియర్ దర్శకుల కంటే కూడా కొత్తదనం కోరుకునే యువ దర్శకులకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించు కున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం రవితేజ తన 77వ చిత్రంగా శివ నిర్వాణ దర్శకత్వంలో `ఇరుముడి` అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ చిత్రం అయ్యప్ప స్వామి మాల - ఆధ్యాత్మిక నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజ మునుపెన్నడూ చూడని రీతిలో ఆధ్యాత్మిక ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. శివ నిర్వాణ ప్రాజెక్ట్ ముగింపు దశకు రావ‌డంతో? రవితేజ మరో ఇద్దరు టాలెంటెడ్ యువ దర్శకులను ఒకేసారి లైన్లో పెట్టడం విశేషం. `మత్తు వదలరా` వంటి విభిన్నమైన చిత్రంతో ఆకట్టుకున్న హసిత్ గోలీ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు జ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హసిత్ గోలీ తనదైన శైలిలో రాసుకున్న ఓవినూత్నమైన కథాంశం రవితేజకు బాగా నచ్చడంతో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. రవితేజ మార్కు ఎనర్జీకి హసిత్ మార్కు కామెడీ తోడైతే ఫలితం అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివేక్ ఆత్రేయతో కూడా రవితేజ చేతులు కలిపారు. వివేక్ ఆత్రేయ నిజానికి నందమూరి బాలకృష్ణ కోసం ఒక మాస్ కథను సిద్ధం చేసారు. కానీ ఇది ప‌ట్టాలెక్క‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డు తుంది. ఈ గ్యాప్ లో రవితేజతో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ఆత్రేయ‌. ఈ ప్రాజెక్టును కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

వివేక్ ఆత్రేయ మేకింగ్ స్టైల్ , రవితేజ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రవితేజ అనుసరిస్తున్న సరికొత్త వ్యూహం వెనుక ఓ బలమైన కారణం ఉంది. సీనియర్ దర్శకులు రొటీన్ ఫార్ములా కథలతో వస్తుం డటంతో? కుర్ర దర్శకులు ఇచ్చే సరికొత్త ఐడియాలు తన ఇమేజ్‌ను మళ్ళీ గాడిలో పెడతాయని రవితేజ నమ్ముతున్నారు. గతంలో కూడా రవితేజ ఎంతోమంది కొత్త దర్శకులను ప్రోత్సహించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. తాజాగా అదే పద్ధతిని మళ్ళీ అనుసరిస్తూ మార్కెట్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ప్రేక్షకులకు విభిన్నమైన వినోదాన్ని పంచాలని పట్టుదలతో ఉన్నారు.