Begin typing your search above and press return to search.

మాస్ జాతర.. ఎపిక్ ఫైట్ తప్పేలా లేదు..!

రాజమౌళి బాహుబలి ఎపిక్ రిలీజ్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సో కచ్చితంగా బాహుబలి ఎపిక్ తో రవితేజ మాస్ జాతర గట్టి పోటీ ఎదుకునే పరిస్థితి కనబడుతుంది.

By:  Ramesh Boddu   |   7 Oct 2025 3:30 PM IST
మాస్ జాతర.. ఎపిక్ ఫైట్ తప్పేలా లేదు..!
X

మాస్ మహరాజ్ రవితేజ మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న రిలీజ్ లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేశాడు. శ్రీవిష్ణు సామజవరగమన సినిమాకు రైటర్ గా పనిచేసిన భాను రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యే కథ చెప్పడంతో వెంటనే ఈ సినిమా ఓకే చేశారు. అసలైతే ఈ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది కానీ సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ అలా అనుకోని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనల్ గా అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కన్ ఫర్మ్ చేశారు.

రీ రిలీజ్ సినిమాతో హెడేక్..

ఐతే ఈ సినిమా రిలీజ్ టైం కు కొత్త సినిమాల తాకిడి లేదని అనుకోగా రీ రిలీజ్ సినిమాతో హెడేక్ వచ్చి పడేలా ఉంది. అదేంటి ఇక్కడ రవితేజ సినిమా ఉంటే రీ రిలీజ్ సినిమా ఎందుకు బజ్ అందుకుంటుంది అంటే. అక్కడ రీ రిలీజ్ అవుతున్న సినిమా బాహుబలి ది ఎపిక్ కాబట్టి ఆలోచించాల్సిందే. ఎందుకంటే అసలే రాజమౌళి అదేదో కొత్త సినిమా రిలీజ్ అన్నట్టుగా తన డ్యూటీ చేస్తున్నాడు. రీ రిలీజ్ లో రెబల్ ఫ్యాన్స్ మాత్రమే కాదు బాహుబలి ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యే సీన్స్ కొన్ని ఉంటాయని అంటున్నారు.

రాజమౌళి బాహుబలి ఎపిక్ రిలీజ్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. సో కచ్చితంగా బాహుబలి ఎపిక్ తో రవితేజ మాస్ జాతర గట్టి పోటీ ఎదుకునే పరిస్థితి కనబడుతుంది. ఐతే మాస్ రాజా ఫ్యాన్స్ మాత్రం మాస్ జాతర మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. సినిమాతో రవితేజ ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ధమాకా తర్వాత రవితేజ..

ధమాకా తర్వాత రవితేజ చేస్తున్న సినిమాలన్నీ కూడా వర్క్ అవుట్ కాలేదు. మళ్లీ ధమాకా జంట కలిసి చేసిన సినిమా మాస్ జాతర. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు కాబట్టి రవితేజ మాస్ జాతత ఫ్యాన్స్ కి జోష్ తెప్పించడం పక్కా అనేలా ఉంది. మరి బాహుబలి ఎపిక్ ఎఫెక్ట్ రవితేజ సినిమా మీద ఎంత పడుతుంది అన్నది రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో అర్ధమవుతుంది.

రవితేజ మాత్రం మాస్ జాతర మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తెలుస్తుంది. సినిమా కథ కథనంతో పాటు రవితేజ ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తారో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా మాస్ జాతరలో ఉందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. సో అవతల బాహుబలి ది ఎపిక్ అయినా కూడా ఇక్కడ ఉంది మాస్ మహారాజ్ రవితేజ కాబట్టి తన మాస్ మేనియా చూపిస్తాడని అంటున్నారు.