Begin typing your search above and press return to search.

రవితేజ 'మాస్ మ్యాడ్ క్యూబ్'..!

మ్యాడ్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ హోస్ట్ గా రవితేజ, సితార నాగ వంశీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Ramesh Boddu   |   22 Oct 2025 10:06 AM IST
రవితేజ మాస్ మ్యాడ్ క్యూబ్..!
X

మాస్ మహరాజ్ రవితేజ మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు. మ్యాడ్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ హోస్ట్ గా రవితేజ, సితార నాగ వంశీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐతే మ్యాడ్, లిటిల్ హార్ట్స్, డీజే టిల్లు ఈ సినిమాల సక్సెస్ అని తెలియగానే మీరే మొదట ఫోన్ చేసి డైరెక్టర్స్ ని విష్ చేశారు. ఒకవేళ మీతో ఒక ఆవేశం లాంటి సినిమా ప్లాన్ చేస్తే అది కూడా టిల్లు, మ్యాడ్ సినిమాల క్రాస్ ఓవర్ గా మాస్ మ్యాడ్ క్యూబ్ కథతో వస్తే చేస్తారా అంటే దానికి రవితేజ ఆల్వేస్ ఓకే ఎప్పుడు మొదలు పెడదాం చెప్పు అని కళ్యాణ్ శంకర్ కి షాక్ ఇచ్చారు రవితేజ.

కోట్ల బడ్జెట్, కథలో ట్విస్ట్ లు, టర్న్ లు అవసరం లేదు..

కళ్యాణ్ శంకర్ కి ఆల్రెడీ ఆ ఆలోచన ఉంది కాబట్టే ఇలాంటి ప్రశ్న అడిగి ఉండొచ్చు. డీజే టిల్లులో సిద్ధు జొన్నలగడ్డ, మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్, విష్ణు, శోభన్, నితిన్ అంతా కలిసి భలే హంగామా చేశారు. కోట్ల బడ్జెట్, కథలో ట్విస్ట్ లు, టర్న్ లు అవసరం లేదు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినా సినిమాలు సక్సెస్ అవుతాయని చూపించాయి ఈ సినిమాలు. ఈ రెండు సినిమాలు సితార నుంచి రావడం విశేషం.

డీజే టిల్లు తర్వాత టిల్లు స్క్వేర్ సెన్సేషనల్ హిట్ అవ్వగా మ్యాడ్ తర్వాత మ్యాడ్ స్క్వేర్ కూడా సక్సెస్ అయ్యింది. ఐతే ఇప్పుడు టిల్లు క్యూబ్, మ్యాడ్ క్యూబ్ కూడా చర్చల్లో ఉన్నాయి. ఐతే ఈ రెండిటినీ క్రాస్ ఓవర్ చేసి మాస్ మ్యాడ్ క్యూబ్ గా రవితేజతో సినిమా చేస్తే నిజంగానే ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ కామెడీ ఎంటర్టైనర్ ఇచ్చినట్టే అవుతుంది.

రవితేజ మాస్ మ్యాడ్ క్యూబ్ స్క్రిప్ట్..

కళ్యాణ్ శంకర్ ఎలాంటి డౌట్ లేకుండా మాస్ మ్యాడ్ క్యూబ్ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టొచ్చు. ఎందుకంటే రవితేజతో ఆవేశం లాంటి సినిమా చేస్తే మాత్రం అది రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫహద్ ఫాజిల్ చేసినా ఆవేశం తెలుగు రైట్స్ ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్ కొనేసింది. కానీ ఆ సినిమా ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ముందు బాలకృష్ణ తో ఆవేశం చేయాలని డిస్కషన్స్ నడిచాయి. కానీ రవితేజ కూడా ఆ సినిమా రీమేక్ లో ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఒకవేళ ఆవేశం వచ్చినా రాకపోయినా మాస్ మ్యాడ్ క్యూబ్ మాత్రం కచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.