Begin typing your search above and press return to search.

మాస్ జాతర.. అసలైన టఫ్ జాబ్ ఇదే..!

ధమాకా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హిట్ సినిమా కరువైంది. వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు.

By:  Ramesh Boddu   |   10 Oct 2025 9:59 AM IST
మాస్ జాతర.. అసలైన టఫ్ జాబ్ ఇదే..!
X

ధమాకా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ హిట్ సినిమా కరువైంది. వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక్కటంటే ఒక్క హిట్ పడలేదు. కెరీర్ లో ఈ టైంలో రవితేజ హిట్ కోసం చేయని ప్రయత్నాలు లేవని చెప్పొచ్చు. రవితేజని ఇష్టపడే వాళ్లు.. ఆయన ఫ్యాన్స్ రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలే కోరతారు. అంటే కథలో కొత్తదనం ఉండాలి కానీ రవితేజ మేనరిజం, మాస్ అప్పీల్ మునుపటిలా ఎనర్జిటిక్ గా ఉండాలని భావిస్తారు. అలాంటి సినిమాతో వస్తే సినిమా హిట్ చేయడం కోసం మేము ఫుల్ టైం డ్యూటీ చేస్తామనేలా మాస్ రాజా ఫ్యాన్స్ ఉన్నారు.

రవితేజ సరసన మరోసారి శ్రీలీల..

ఈమధ్య రవితేజ కొన్ని ప్రయోగాలు చేసి విఫలమయ్యారు. అందుకే తనకు నచ్చిన మెచ్చిన మాస్ పంథానే ఎంచుకున్నారు. భాను బోగవరపు డైరెక్షన్ లో ఈసారి మాస్ జాతర సినిమాతో వస్తున్నారు రవితేజ. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. అక్టోబర్ 31న సినిమా రిలీజ్ కాబోతుంది. రవితేజ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఐతే మాస్ జాతర మొదట్లో రిలీజైన టీజర్ పై మిశ్రమ స్పందన వచ్చింది.

రిలీజ్ అవుతున్న సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐతే మాస్ జాతర టీం కు ముందున్న టఫ్ ఫైట్ సినిమా ట్రైలర్. ఈమధ్య కొన్ని సినిమాలు ట్రైలర్ చూసే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లాలా స్కిప్ చేయాలా అన్నది డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలో రవితేజ టీజర్ కి కాస్త రొటీన్ అన్న టాక్ రాగా ఈ ట్రైలర్ తోనే చెప్పాలనుకున్న కథ చెబుతూ మాస్ రాజా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలి.

మాస్ జాతర ట్రైలర్ కట్..

ఈ విషయంలోనే మాస్ జాతర టీం తలమునకలవుతుంది. ట్రైలర్ కి పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా రిలీజ్ దాకా కాస్త కూస్తో ఆ జోష్ ఉంటుంది. వన్స్ థియేటర్ లోకి ఆడియన్ వచ్చాడంటే ఇక ఆ సినిమా చూసుకుంటుంది. మాస్ జాతర ట్రైలర్ కట్ గురించి డైరెక్టర్, నిర్మాత, హీరో ముగ్గురు చాలా ఫోకస్ తో పనిచేస్తున్నారట. అసలే సితార నాగ వంశీ ఈమధ్య చేసిన సినిమాలన్నీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే మాస్ జాతర మీద ఆ ఇంపాక్ట్ పడకూడదని ప్రమోషన్స్ లో కూడా ఆయన పెద్దగా కనిపించట్లేదు.

సామజవరగమన సినిమాతో రైటర్ గా సూపర్ హిట్ అందుకున్న భాను బోగవరపు డైరెక్టర్ గా తొలి ప్రయత్నమే రవితేజతో మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీని ఆయన హిట్ సినిమాలకు మ్యాచ్ అయ్యేలా చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తే ఈ డైరెక్టర్ కి మళ్లీ మళ్లీ ఛాన్స్ లు వస్తాయి. ధమాకా తర్వాత రవితేజ ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు. మాస్ జాతర తో అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.