రవితేజ ఆ రిస్క్ చేస్తాడా?
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Sept 2025 3:00 AM ISTహిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు. అయితే గత కొన్ని సినిమాలుగా రవితేజ ఖాతాలో సరైన హిట్ అన్నది లేదు. ధమాకా తర్వాత రవితేజకు మరో హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత మాస్ మహారాజా పలు సినిమాలు చేసినప్పటికీ అవన్నీ ఆయనకు నిరాశనే మిగిల్చాయి.
ఆగస్ట్ 27 నుంచి మాస్ జాతర వాయిదా
అయితే ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. వాస్తవానికి మాస్ జాతర సినిమా ఆగస్ట్ 27న రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ పెండింగ్ ఉండటంతో వాయిదా పడింది.
బాహుబలి ది ఎపిక్ తో పోటీ?
ఆగస్ట్ నుంచి సినిమాను వాయిదా వేస్తూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో మాస్ జాతర రిలీజ్ డేట్ గురించి ఇప్పుడో వార్త వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మాస్ జాతర బాహుబలి ది ఎపిక్ సినిమాతో పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కానున్న అక్టోబర్ 31 నాడే ఈ సినిమా కూడా రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే బాహుబలి ది ఎపిక్ అనేది రెగ్యులర్ రీరిలీజ్ సినిమా కాదు, రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమాను మొత్తం ఎడిట్ చేసి, కొన్ని డిలీట్ చేసిన సీన్స్ ను కూడా యాడ్ చేసి దీన్ని రిలీజ్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి బాహుబలి ది ఎపిక్ కు నెవర్ బిఫోర్ హైప్, క్రేజ్ ఉండే ఛాన్సుంది. దాంతో పాటూ రాజమౌళి ఈ సినిమా కోసం ప్రమోషన్స్ ను కూడా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ తన సినిమాను రిలీజ్ చేస్త ఆ ఎఫెక్ట్ కచ్ఛితంగా కలెక్షన్లపై పడే ప్రమాదముంది. మరి రవితేజ ఆ రిస్క్ చేస్తాడో లేదో చూడాలి.
