వాటన్నింటినీ చాలా మిస్ అవుతున్నా!
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కలయికలో రాబోతున్న తాజా చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Oct 2025 6:41 PM ISTమాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కలయికలో రాబోతున్న తాజా చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. వాస్తవానికి మాస్ జాతర ఇప్పటికే రిలీజ్ అవాల్సింది కానీ షూటింగ్ లేటవడం వల్ల సినిమా వాయిదా పడి అక్టోబర్ 31న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
అందులో భాగంగానే చిత్ర యూనిట్ యాంకర్ సుమతో కలిసి ఓ ఇంటర్వ్యూ చేయగా, ఆ ఇంటర్వ్యూలో హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీలతో పాటూ డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా చిత్ర యూనిట్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. రవితేజ ఆఫ్ సెట్స్ లో ఎలా ఉంటారని యాంకర్ సుమ అడగ్గా దానికి శ్రీలీల సమాధానమిచ్చింది.
ఎక్కువ కబుర్లు చెప్పేది రవితేజతోనే!
రవితేజ చాలా ఈజీయెస్ట్ పర్సన్ అని చెప్పిన శ్రీలీల, కబుర్లకు రవితేజ బెస్ట్ అని, తాను ఎక్కువగా కబుర్లు చెప్పే హీరో రవితేజనే అని చెప్పగా, వెంటనే రవితేజ అందుకుని మాస్ జాతర సెట్ లోకి రాగానే శ్రీలీల లోపలున్న లీల బయటికొస్తుందని, అంతేకదా అని శ్రీలీలని అడిగితే అవునని చెప్పింది. ఈ సినిమా సెట్స్ లో చాలా ఎంజాయ్ చేశానని శ్రీలీల చెప్పుకొచ్చింది.
నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటా
ఇక అదే ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ తన చిన్నతనంలో జాతరలకు వెళ్లి చాలా ఎంజాయ్ చేసేవాడినని, భీమవరం కోడిపందాలకు, రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్లాలనిపిస్తుందని, ఇప్పుడు వాటన్నింటినీ చాలా మిస్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు రవితేజ. తనకు టైమ్ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇన్‌స్టాలో రీల్స్ చూస్తుంటానని, అందులో కొన్ని క్రియేటివ్ గా చాలా బావుంటాయని, కానీ ట్విట్టర్ మాత్రం చూడనని, ట్విట్టర్ లో అంతా నెగిటివ్ బ్యాచేనని, నెగిటివిటీకి తాను చాలా దూరంగా ఉంటానని రవితేజ చెప్పుకొచ్చారు.
