మాస్ జాతర: గట్టెక్కిన ఆ ఇద్దరు హీరోస్ వీళ్లే!
కొన్ని సందర్భాలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సమీకరణాలు మారిపోతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరికి వెళ్లిపోతుంది.
By: Madhu Reddy | 5 Nov 2025 10:24 AM ISTకొన్ని సందర్భాలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సమీకరణాలు మారిపోతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో దగ్గరికి వెళ్లిపోతుంది. అలా ఒక హీరో సినిమా ఇంకో హీరో దగ్గరికి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలానే చాలామంది దర్శకులు ఒక హీరోతో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక హీరో ఒక సినిమాను వదులుకున్నప్పుడు, ఆ సినిమాను మరో హీరో చేసి అది సక్సెస్ అయితే, ఆ ప్రాజెక్ట్ వదులుకున్న హీరోకి బాధ ఉంటుంది. అనవసరంగా మంచి ప్రాజెక్టు వదులుకున్నానే అని లో లోపల ఫీల్ అవుతూ ఉంటారు.
ఉదాహరణకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు ఇదే జరిగింది. మొదట ఆ సినిమాకు శర్వానంద్ ను అనుకున్నారు. కానీ అప్పటికే ప్రస్థానం సినిమాలో తన క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకోవడం అలా ఉండటం వలన దానిని సందీప్ కిషన్ రిజెక్ట్ చేశాడు.అలానే మంచు మనోజ్ కూడా ఆ సినిమా చేయాల్సి ఉంది అని రీసెంట్ ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. అలా ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఆ ఇద్దరు హీరోలు కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి
గట్టెక్కిన ఇద్దరి హీరోలు..
అయితే ఇప్పుడు అలా కాకుండా రవితేజ మాస్ జాతర సినిమా నుంచి ఇద్దరు హీరోలు గట్టెక్కినట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్న భాను భోగవరపు మాస్ జాతర సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరిచయం చేసిన ఘనత రవితేజకు ఉంది. వాళ్లలో గోపీచంద్ మలినేని, బాబీ వంటి దర్శకులు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు.
భాను దర్శకుడిగా పరిచయమైన మాస్ జాతర సినిమా కథను మొదట రవితేజకి కాకుండా ఇద్దరు హీరోలకు చెప్పారట. అందులో గోపీచంద్ ఒకరు. కొన్ని కారణాల వలన గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డకు కూడా ఈ కథను చెప్పాడు భాను. అప్పటికే సితార ఎంటర్టైన్మెంట్స్ తో సిద్ధూ కి మంచి అనుబంధం ఉండటం వల్లనే తనకి కూడా చెప్పి ఉంటాడు. కానీ సిద్దు కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
ఇక బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుంది అని అందరూ బలంగా నమ్మారు. ప్రొడ్యూసర్ నాగ వంశీ బయటకు గట్టిగా మాట్లాడకపోయినా తన కాన్ఫిడెన్స్ మాత్రం పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు. అయితే ఈ సినిమాకి పెద్దగా పాజిటివ్ టాక్ కూడా రాలేదు. ఇది కూడా ఒక లాస్ ప్రాజెక్ట్ అని తేలిపోయింది. అలా గోపీచంద్, సిద్ధూ జొన్నలగడ్డ ఈ సినిమాను ఒప్పుకోకుండా ఫ్లాప్ నుంచి గట్టెక్కారు అని చెప్పవచ్చు.
బాహుబలి ఎఫెక్ట్
మాస్ జాతర సినిమాకి మంచి డేట్ దొరికింది అనుకునే తరుణంలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా మళ్లీ రీ రిలీజ్ అయింది. వాస్తవానికి మాస్ జాతర సినిమా థియేటర్లో ప్రేక్షకులు కంటే కూడా బాహుబలి రి రిలీజ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులు ఎక్కువ.
మాస్ జాతరకు విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మెరుగు కలెక్షన్లు ఉండేవి. ఇక ప్రేక్షకులకు కూడా వేరే సినిమా చూసే ఆప్షన్ లేక అందరూ బాహుబలికి మరోసారి బ్రహ్మరథం పట్టారు. రవితేజ పరిచయం చేసిన దర్శకులలో హరీష్ శంకర్ కి కూడా ఫస్ట్ సినిమా వర్కౌట్ కాలేదు. ఇక భాను హరీష్ మాదిరిగానే ఇంకో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడతాడేమో వేచి చూడాలి
