Begin typing your search above and press return to search.

రవితేజ 'మాస్ జాతర'.. గట్టి పోటీ తప్పేలా లేదు!

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలతో థియేటర్స్ లోకి వస్తున్నారు.

By:  M Prashanth   |   17 Oct 2025 2:00 PM IST
రవితేజ మాస్ జాతర.. గట్టి పోటీ తప్పేలా లేదు!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలతో థియేటర్స్ లోకి వస్తున్నారు. కానీ సరైన హిట్స్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్న రవితేజ.. మరికొద్ది రోజుల్లో మాస్ జాతర మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి అవ్వగా, మాస్ జాతర మూవీని ఎట్టకేలకు అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

నిజానికి.. మాస్ జాతర సినిమా చాలా రోజుల క్రితం రిలీజ్ కావాల్సి ఉంది. సంక్రాంతి నుంచి వేసవికి.. వేసవి నుంచి వినాయక చవితికి వాయిదా పడింది. ఇప్పుడు మరో 13 రోజుల్లో విడుదల చేయనుంది. కానీ సినిమాకు మాత్రం గట్టి పోటీ ఎదురవనుంది. ఎందుకంటే మూవీ రిలీజ్ కు అక్టోబర్ 31వ తేదీన సరైన డేట్ కాదు.

అప్పుడు ఎలాంటి సెలవులు లేవు.. పండుగలు లేవు.. అదంతా ఒకెత్తు అయితే ఆ రోజు బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల రీ రిలీజ్ గా బాహుబలి ది ఎపిక్ వెర్షన్ రానుంది. ఇప్పటికే దానిపై ఆడియన్స్ లో భారీ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఆ ఎపిక్ వెర్షన్ తో మాస్ జాతరకు పోటీ తప్పదనే చెప్పాలి.

అదే సమయంలో సినిమాను అనుకున్న స్థాయిలో మేకర్స్ ప్రమోట్ చేయడం లేదు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు. ఒక విధంగా మెప్పించినా.. ఆశించిన ఊపును మాత్రం ఇవ్వలేదు. దీంతో ట్రైలర్ సహా వివిధ ప్రమోషనల్ ఈవెంట్స్ తో మేకర్స్ ఫుల్ గా సందడి చేయాల్సి ఉంది.

అయితే మేకర్స్ మాత్రం అవుట్ పుట్ పై నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. సినిమా సెట్స్ లో ఉన్నప్పుడే మూవీ మంచి విజయం సాధిస్తుందని అంచనా వేశారట. కచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని అనుకున్నారని సమాచారం. కానీ బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండడం వల్ల ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేయాలి. దానికి తోడు కంటెంట్ ఉంటే మూవీ హిట్ పక్కా. మరేం జరుగుతుందో వేచి చూడాలి.