మళ్లీ కలుస్తున్న ‘దుబాయ్ శీను’ కాంబో.. రవితేజ మూవీపై క్రేజీ బజ్!
ఈ సినిమాలో మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. టాలెంట్ యాక్టర్ జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.
By: Madhu Reddy | 6 Oct 2026 3:08 PM ISTమాస్ మహారాజా రవితేజ ఇరుముడి సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం విభిన్నమైన సబ్జెక్ట్ ఎంచుకున్నారు. టాలీవుడ్‌లో తనదైన స్క్రీన్‌ప్లేతో మేజిక్ చేసే డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఆయన జతకట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ సీనియర్ నటుడు విలన్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. అంతేకాక దసరా సందర్భంగా ఈ మూవీ లాంచ్ కానుండటం విశేషం.
‘దుబాయ్ శీను’ కాంబో రిపీట్.. విలన్‌గా జేడీ చక్రవర్తి:
ఈ సినిమాలో మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. టాలెంట్ యాక్టర్ జేడీ చక్రవర్తి చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. రవితేజ, జేడీ చక్రవర్తి చివరిసారిగా 2007లో బ్లాక్‌బస్టర్ హిట్ ‘దుబాయ్ శీను’ చిత్రంలో కలిసి పనిచేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ మళ్లీ ఎదురుపడనుండటం అభిమానుల్లో అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది. ఇక ఈ సినిమాను లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జేడీ రీఎంట్రీ.. మరో ట్రెండ్ సెట్ అవుతుందా?:
ఇక ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి నిజంగానే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌గా మారి ఏ విధంగా టాలీవుడ్‌ను ఏలుతున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జేడీ చక్రవర్తి కూడా ఈ మూవీతో విలన్‌గా సక్సెస్ కొడితే, ఆయన కెరీర్‌లోనూ సరికొత్త అధ్యాయం మొదలై వరుసగా క్రేజీ విలన్ క్యారెక్టర్లు క్యూ కట్టడం ఖాయమనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.
హారర్, కామెడీ, థ్రిల్లర్.. పక్కా ప్యాకేజ్:
టాలీవుడ్ లో ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ వంటి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక మార్క్ వేసుకున్న వివేక్ ఆత్రేయ, ఈసారి రవితేజ కోసం హారర్, కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఒక పక్కా ప్యాకేజ్‌ను సిద్ధం చేశారు. ఇక రవితేజ మాస్ ఎనర్జీ, హై-వోల్టేజ్ కామెడీ టైమింగ్‌కు వివేక్ ఆత్రేయ డిఫరెంట్ టేకింగ్ తోడైతే స్క్రీన్‌పై సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
దసరా కానుకగా అధికారిక లాంచింగ్:
ఇప్పుడు ‘ఇరుముడి’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసే వివేక్ ఆత్రేయతో ఆయన కలుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాను వచ్చే దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ, వివేక్ ఆత్రేయ క్రియేటివ్ డైరెక్షన్, జేడీ చక్రవర్తి విలనిజం అన్నీ కుదిరితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయం. ఇక ‘తులాభారం’ టైటిల్‌తో రాబోతున్న ఈ డిఫరెంట్ హారర్-కామెడీ థ్రిల్లర్ టాలీవుడ్‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి..
