Begin typing your search above and press return to search.

టాక్సిక్‌తో ఇరుముడికి టెన్షన్‌ లేదు.. కారణం ఇదే!

రవితేజ బాక్సాఫీస్‌ జోరు ఈ వారం వరకే అని, వచ్చే వారంలో ఇరుముడి సందడి కనిపించక పోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

By:  Ramesh Palla   |   24 Aug 2026 4:06 PM IST
టాక్సిక్‌తో ఇరుముడికి టెన్షన్‌ లేదు.. కారణం ఇదే!
X

రవితేజ హీరోగా వచ్చిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ దూసుకు పోతుంది. ఇప్పటికే సినిమా కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లను నమోదు చేసినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రవితేజ కెరీర్‌లోనే అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన మూవీగానూ ఈ సినిమా నిలవబోతుందట. ఇక యూఎస్‌లో ఇప్పటి వరకు సాధ్యం కాని మిలియన్‌ మార్క్‌ను ఇరుముడి సినిమాతో రవితేజ దక్కించుకున్నాడు. కేవలం రెండు రోజుల్లోనే ఇరుముడి సినిమా యూఎస్‌ఏలో ఏకంగా మిలియన్‌ డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. లాంగ్‌ రన్‌లో సినిమా దాదాపుగా మూడు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను క్రాస్‌ చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ బాక్సాఫీస్‌ జోరు ఈ వారం వరకే అని, వచ్చే వారంలో ఇరుముడి సందడి కనిపించక పోవచ్చు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ ఇరుముడి కలెక్షన్స్‌..

ఇరుముడి సినిమా విడుదలకు వారం రోజుల ముందు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తక్కువ సమయంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. రెండో వారంలో మంచి వసూళ్లు దక్కుతాయని అంతా భావించారు. కాని తెలుగు రాష్ట్రాల్లో విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌కి ఇరుముడి సినిమా కారణంగా పెద్ద దెబ్బ తగిలినట్లు అయింది. దాదాపుగా పాతిక నుంచి ముప్పై కోట్ల వసూళ్లు ఇరుముడి కారణంగా తగ్గి ఉంటాయనే అభిప్రాయంను బాక్సాఫీస్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇరుముడి వారం ఆలస్యంగా వచ్చి ఉంటే విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కి ప్రాఫిట్‌ డబుల్‌ వచ్చి ఉండేదని కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి రవితేజ ఇరుముడి సినిమా ఎదుర్కోబోతుందా అనే చర్చ మొదలైంది.

కన్నడ స్టార్‌ యశ్‌ టాక్సిక్‌...

కన్నడ స్టార్‌ యశ్‌ నటించిన 'టాక్సిక్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈ వారంలోనే సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి దిల్‌ రాజు ఏర్పాట్లు పూర్తి చేశాడు. చాలా తక్కువ సమయంలోనే సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేయడం జరిగింది. దిల్‌ రాజుకి ఉన్న థియేటర్‌ నెట్‌వర్క్‌ కారణంగా టాక్సిక్‌ ను భారీగా విడుదల చేయడం ఖాయం. అయితే ఇరుముడి థియేటర్లను తొలగించడం అనేది జరగక పోవచ్చు అనేది సినీ వర్గాల మాట. ప్రస్తుతం రెండు మూడు స్క్రీన్స్‌ లో ఇరుముడి ఆడుతూ ఉంటే, రెండో వారంకు సింగిల్‌ స్క్రీన్స్ కు పరిమితం కానుంది. టాక్సిక్‌ కాకున్నా మరే సినిమా వచ్చినా రెండో వారంకు థియేటర్ల సంఖ్య, స్క్రీన్స్ సంఖ్య తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఇరుముడి సినిమాకు థియేటర్ల విషయంలో, స్క్రీన్స్‌ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు.

విశ్వనాథ్ అండ్‌ సన్స్‌ కలెక్షన్స్‌..

ఇక ప్రేక్షకుల విషయానికి వస్తే ఇరుముడి సినిమాను పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఓన్‌ చేసుకుని మరీ చూస్తున్నారు. టాక్సిక్ సినిమాలో ఉన్న హింస ఫ్యామిలీ ఆడియన్స్‌ కు దూరం ఉంచబోతుందని తెలుస్తోంది. కనుక టాక్సిక్‌ విడుదల అయ్యి థియేటర్లలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆ సినిమాకు ఎక్కువ వెళ్లే అవకాశం లేదు. రెండో వారంలో కూడా ఇంకా చూడని ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక యూత్‌ ఆడియన్స్‌ మాత్రమే టాక్సిక్‌ కు వెళ్తారు అనే విశ్లేషణలు ఉన్నాయి. టాక్సిక్ కు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చినా కూడా ఇరుముడి సినిమాకు వచ్చే నష్టం ఏమీ లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అంచనా, రెండు పూర్తి విభిన్నమైన జోనర్‌ సినిమాలు కనుక ఇబ్బంది ఉండక పోవచ్చు అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఇరుముడి వల్ల విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కు జరిగిన నష్టం కచ్చితంగా టాక్సిక్‌ వల్ల ఇరుముడికి ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. యశ్‌ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కనుక టాక్సిక్ కి తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్‌ ఓపెనింగ్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి టాక్సిక్ ఆ స్థాయి వసూళ్లు సాధిస్తుందా అనేది చూడాలి.