‘ఇరుముడి’ జోరు.. రెండో రోజు కూడా తగ్గట్లేదుగా..
రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు వచ్చిన టాక్ బాక్సాఫీస్ దగ్గర బాగానే పని చేస్తోంది. ఓపెనింగ్ డే క్రేజ్‌తో టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండటం కామన్.
By: M Prashanth | 22 Aug 2026 11:41 AM ISTరవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు వచ్చిన టాక్ బాక్సాఫీస్ దగ్గర బాగానే పని చేస్తోంది. ఓపెనింగ్ డే క్రేజ్‌తో టికెట్ సేల్స్ ఎక్కువగా ఉండటం కామన్. అసలు సినిమా పరిస్థితి ఏంటనేది రెండో రోజు నుంచి కాస్త క్లియర్ అవుతుంది. ‘ఇరుముడి’ విషయంలో మాత్రం డే 2లో కూడా బుకింగ్స్ స్పీడ్ తగ్గకపోవడం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బుక్‌మైషోలో శనివారం ఒక దశలో గంటలోనే 35.42 వేల టికెట్లు బుక్ అయినట్లు కనిపించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ట్రాకింగ్ లెక్కల ప్రకారం రీజినల్ సినిమాల్లో గంట వ్యవధిలో నమోదైన అత్యధిక టికెట్ సేల్స్ ఇదేనని చెబుతున్నారు. పైగా ఇది మొదటి రోజు కాకుండా డే 2లో రావడం విశేషం. నిన్న ఒక దశలో ‘ఇరుముడి’ 32.5 వేల అవర్లీ బుకింగ్స్ వరకు వెళ్లగా.. ఇప్పుడు ఆ నంబర్ కూడా దాటేసింది.
నిజానికి రవితేజ సినిమాకు ఈ స్థాయి హోల్డ్ చాలా అవసరం. గత కొంతకాలంగా ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నా, టాక్ తర్వాత అదే జోరు కొనసాగడం దగ్గరే ఇబ్బంది ఎదురైంది. ‘ఇరుముడి’కి మాత్రం మొదటి షోల నుంచే ఎమోషన్, రవితేజ పర్ఫామెన్స్‌తో పాటు క్లైమాక్స్ గురించి పాజిటివ్ టాక్ రావడం ప్లస్ అయ్యింది. అదే ఇంపాక్ట్ బుకింగ్స్ మీద కనిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ మొదలవడంతో శనివారం షోలకు డిమాండ్ పెరిగింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఫస్ట్ డే ఫ్యాన్స్ హంగామాతో వచ్చిన నంబర్ కాదు. రెండో రోజు కూడా గంటకు 35 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయంటే కొత్తగా సినిమా చూసేందుకు వస్తున్న ఆడియన్స్ సంఖ్య బాగానే పెరుగుతున్నట్లు అర్థమవుతోంది. అదనపు షోలు, స్క్రీన్స్ పెరిగితే శని, ఆదివారాల్లో ఈ స్పీడ్ ఇంకెంత వరకు వెళ్తుందన్నది చూడాలి. ప్రస్తుతం పోటీగా మరో భారీ సినిమా లేకపోవడం వల్ల మంచి టాక్ మొత్తం ఈ సినిమాకే ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా బాగానే కనిపిస్తోంది.
ఒకప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిందనే మాటలు వినిపించినా.. కంటెంట్ నచ్చితే మాత్రం వాళ్లు వస్తారనే విషయం మళ్లీ కనిపిస్తోంది. ఇప్పుడు ఆదివారం ఈ జోరు ఎక్కడికి వెళ్తుందన్నదే నెక్స్ట్. వీకెండ్ వరకు మంచి బుకింగ్స్ రావడం ఒక లెక్క అయితే, సోమవారం నుంచి అదే హోల్డ్ కనిపించడం మరో లెక్క. ప్రస్తుతం మాత్రం ‘ఇరుముడి’ డే 2 బుకింగ్స్ చూస్తే రవితేజకు చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర కావాల్సిన రన్ మొదలైనట్టే కనిపిస్తోంది.
