Begin typing your search above and press return to search.

స‌మాజంలో ప‌రిస్థితులే హీరోకి విల‌న్!

మాస్ రాజా రవితేజ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'ఇరుముడి'. అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న చిత్రం కొన్ని గంట‌ల క్రిత‌మే రిలీజ్ అయింది.

By:  Srikanth Kontham   |   21 Aug 2026 1:56 PM IST
స‌మాజంలో ప‌రిస్థితులే హీరోకి విల‌న్!
X

మాస్ రాజా రవితేజ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'ఇరుముడి'. అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న చిత్రం కొన్ని గంట‌ల క్రిత‌మే రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి ఆస‌క్తిక‌ర విశే షాల‌ను శివ రివీల్ చేసారు. అవేంటో ఆయ‌న మాట‌ల్లోనే... ఇది ఓ సినిమాలా కాకుండా యదార్థ జీవన ప్రయాణంలా ఉంటుంది. ఫార్ములా చిత్రాలకు భిన్నంగా, సహజత్వానికి పెద్దపీట వేస్తూ ఈ చిత్రాన్ని మలిచిన‌ట్లు తెలిపారు. 'ఇరుముడి' చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే? ఇందులో ప్రత్యేకంగా విలన్ పాత్ర ఉండదు.

కథానాయకుడు ఒక విలన్‌తో పోరాడటం కంటే నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, సంఘటనలు , మనుషుల మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణలే ఇందులో కీలకం. రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కనపెట్టి సామాన్యుడు త‌న‌ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలనే తెర‌కెక్కించామ‌న్నారు. అలాగే చిత్రీకరణ విషయంలో దర్శకుడు తీసుకున్న నిర్ణయం కథకు ఎంతో బలాన్ని చేకూర్చింది. సినిమాలో చూపించే ప్రాంతాలను వేరే పేర్లతో పిలవకుండా? అవి ఎక్కడైతే చిత్రీకరించారో? ఆ ప్రాంతాల ఒరిజినల్ పేర్లనే (సీలేరు, డొంకరాయ వంటివి) సినిమాలోనూ యథాతథంగా ఉంచారు.

ఒక ప్రాంతపు సంస్కృతి, అక్కడి వాతావరణం కథలో అంతర్భాగంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు సినిమాను చూస్తున్నట్లు కాకుండా... తమ పక్కనే ఉన్న ఊరిలో తమకు తెలిసిన మనుషుల మధ్య కథ జరుగుతున్నట్లుగా ఫీల్ అవుతారు. సినిమా అంతా ఆర్గానిక్ ఫీల్‌తో సాగడం వల్ల పాత్రలు ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరవుతాయి. కృత్రిమ సెట్టింగ్‌లు లేదా కల్పిత లోకాల కంటే మనం నిత్యం చూసే పరిసరాల్లోనే కథను నడపడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు.

శివ నిర్వాణ గత చిత్రాలైన `నిన్ను కోరి`, `మజిలీ` వంటి వాటిలో కూడా చిన్న చిన్న సన్నివేశాల ద్వారానే గొప్ప ఎమోషన్స్‌ను పండించారు. తాజాగా `ఇరుముడి`లో కూడా అదే శైలిని కొన‌సాగించారు. మనుషుల మధ్య ఉండే సున్నితమైన బంధాలను, సంఘర్షణలను తెరపై ఆవిష్కరించారు. ఎలాంటి అదనపు గ్లామర్ .. యాక్షన్ హంగులు లేకుండా కేవలం భావోద్వేగాల బలం మీదనే సినిమాను నడపడం అన్న‌ది మంచి కళాత్మక ప్రయత్నంగా చెప్పొచ్చు.

అంతిమంగా `ఇరుముడి` అయ్యప్ప భక్తికి సంబంధించిన సినిమా మాత్రమే కాదు. ఇది ఒక తండ్రి, బిడ్డ , సమాజం మధ్య సాగే ప్రయాణం. వాస్తవికతకు అద్దం పడుతూ కళ్ళకు కట్టినట్లుగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేసారు. ఈ చిత్రం ప్రేక్షకులందరినీ తమ సొంత కథగా భావించేలా చేస్తుందని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.