Begin typing your search above and press return to search.

రవితేజ ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తెర పడేనా?

రవితేజ 'ఇరుముడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో భారీ అంచనాల నడుమ విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రవితేజ నిరాశ పరిచాడు.

By:  Ramesh Palla   |   20 Aug 2026 10:44 AM IST
రవితేజ ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తెర పడేనా?
X

రవితేజ 'ఇరుముడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో భారీ అంచనాల నడుమ విడుదలైన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి తో రవితేజ నిరాశ పరిచాడు. రవితేజ మార్క్‌ ఎంటర్‌టైనర్‌ ఆ సినిమాలో ఉంటుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. రవితేజ అభిమానులు గత నాలుగు ఏళ్లుగా సాలిడ్ కమర్షియల్‌ హిట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ధమాకా' స్థాయి విజయం మళ్లీ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న అభిమానులకు 'ఇరుముడి' సినిమాపై చాలా ఆశలు ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వానపై అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన గత చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఇరుముడి ప్రకటించినప్పటి నుంచి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అవుతూ వచ్చింది. సినిమా విడుదల సమయానికి ఆ పాజిటివ్‌ బజ్‌ మరింతగా పెరిగింది.

రవితేజ అభిమానుల ఎదురు చూపులతో...

అయ్యప్ప మాల చుట్టు తిరుగుతూనే, తండ్రి-కూతురు బాండింగ్‌ను చూపించే విధంగా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ను చూస్తే అర్థం అయింది. అదే సమయంలో మాస్‌ ఎలిమెంట్స్‌ పుష్కలంగానూ ఉండబోతున్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ఇరుముడి సినిమాతో రవితేజ అభిమానులు కోరుకునే కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు, సెంటిమెంట్‌ టచ్‌, భక్తి సైతం ఈ సినిమాలో ఉండబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు, సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శివ నిర్వాన దర్శకత్వంలో ఇరుముడి..

రవితేజ అయ్యప్ప స్వామి మాలకు సంబంధించిన సన్నివేశాలు ఎలా ఉంటాయా అనే ఆసక్తి సైతం అభిమానుల్లో ఉంది. సాధారణంగా ఆయన పాత్రలు చాలా జోష్‌తో, మాస్‌ మసాలా ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. అలాంటి హీరో అయ్యప్ప మాల ధరించిన పాత్రలో ఎలా నటించి ఉంటాడు అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రవితేజ ఈ సినిమాలో పదేళ్ల కూతురుకు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. అంటే కాస్త పెద్ద వయసు వ్యక్తి పాత్ర అన్నట్లుగా చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్లుగా ఆయన మేకోవర్‌ను దర్శకుడు శివ నిర్వాన డిజైన్‌ చేశాడు. రవితేజ మాస్‌ ఇమేజ్‌ను దర్శకుడు శివ నిర్వాన సెన్సిబులిటీతో ఎలా మ్యాచ్‌ చేశాడు, రెండు ఎలా కలిశాయి అనేది సైతం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ముఖ్యంగా ట్రైలర్‌ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి అనడంలో సందేహం లేదు.

రవితేజ-శివ నిర్వాన ఇరుముడి మూవీ రిలీజ్‌..

మైత్రి మూవీ మేకర్స్‌ ఈ మధ్య కాలంలో వరుసగా మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాతో మరో విజయం వారి ఖాతాలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే అభిప్రాయం బాక్సాఫీస్‌ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఇరుముడి సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌ భారీగా జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. బుక్‌ మై షో లో ఇరుముడి ట్రెండ్‌ అవుతుందని, గంటకు వేల సంఖ్యల్లో టికెట్లు బుక్‌ అవుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో రవితేజ అభిమానులు, మీడియా వారు స్క్రీన్‌ షాట్స్ షేర్‌ చేస్తున్నారు. రవితేజ సినిమాకు గత కొంత కాలంగా దక్కని భారీ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ ఇరుముడికి దక్కబోతున్నట్లుగా అభిమానులు బలంగా విశ్వసిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న రవితేజ ఇరుముడి ఫ్యాన్స్‌ సూపర్‌ హిట్‌ ఆశల ఎదురు చూపులకు తెర దించేనా చూడాలి.