Begin typing your search above and press return to search.

రిలీజ్ ముందే ఇరుముడి బాక్సాఫీస్ హీట్.. ఎలా ఉందంటే?

తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్‌మైషోలో 72 వేల+, డిస్ట్రిక్ట్‌లో 38 వేల+ టికెట్లు వెళ్లినట్లు సమాచారం.

By:  M Prashanth   |   20 Aug 2026 12:18 PM IST
రిలీజ్ ముందే ఇరుముడి బాక్సాఫీస్ హీట్.. ఎలా ఉందంటే?
X

రవితేజ సినిమాలకు బజ్ క్రియేట్ అయితే బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ జోరు మామూలుగా ఉండదు. గత సినిమాలకు కాస్త ఆ హడావుడి తక్కువగానే ఉన్నా ఈసారి ‘ఇరుముడి’ విషయంలో మాత్రం రిలీజ్‌కు ముందే లెక్క కాస్త మారింది. తెలుగు రాష్ట్రాల్లో బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ కలిపి ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుక్‌మైషోలో 72 వేల+, డిస్ట్రిక్ట్‌లో 38 వేల+ టికెట్లు వెళ్లినట్లు సమాచారం.




బుకింగ్స్ స్పీడ్ చూసి కొన్ని ఏరియాల్లో కొత్త థియేటర్లు, అదనపు షోలు కూడా పెంచుతున్నారు. హైదరాబాద్‌లో చాలా థియేటర్లలో మొదటి రోజు షోలకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. విమల్ 70 ఎంఎం, అల్లు సినిమాస్, ఏఎంబీ, ఏఏఏ సినిమాస్, ఆర్ట్ సినిమాస్, సాయిరామ్, శ్రీరాములు లాంటి థియేటర్లలో ఉన్న షోలు ఫుల్ లేదా ఫాస్ట్ ఫిల్లింగ్‌లో ఉన్నాయి.

బ్రహ్మరాంబ, అర్జున్ 70 ఎంఎం దగ్గర కూడా ఇదే పరిస్థితి. వైజాగ్‌లో కామేశ్వరి, శరత్, జగదాంబ, శ్రీకన్య థియేటర్లలో కొన్ని షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. ఓవర్సీస్‌లో కూడా ‘ఇరుముడి’కి మంచి స్టార్ట్ దొరికింది. నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ 225 వేల డాలర్లు దాటాయి. రవితేజకు ఇటీవలి సినిమాలతో పోలిస్తే ఇది మంచి నంబర్ అనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఒకేసారి అడ్వాన్స్‌లు కదలడం వల్ల మొదటి రోజు ఓపెనింగ్స్‌పై ట్రేడ్‌లో అంచనాలు పెరిగాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మిస్టరీ, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫాదర్-డాటర్ బాండ్, డివినిటీ కూడా ఉంటాయని టీమ్ చెబుతోంది.

మల్లెపూల పల్లకి పాటకు వచ్చిన రెస్పాన్స్ కూడా సినిమాకు ఉపయోగపడింది. టీజర్, ట్రైలర్‌లో రవితేజ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై కూడా ఫ్యాన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సినిమా మీద ఆయన కూడా చాలా నమ్మకంగా మాట్లాడుతున్నాడు. బేబీ నక్షత్ర, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రిలీజ్‌కు ముందే పాటలు, ట్రైలర్‌తో పాటు బుకింగ్స్ కూడా కలిసి రావడం రవితేజకు ఈసారి మంచి ఓపెనింగ్ ఇచ్చేలా కనిపిస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత బాగున్నా అసలు లెక్క రేపటి టాక్‌తోనే తేలుతుంది. మొదటి రోజు వరకు ఉన్న ఈ హీట్‌ను సినిమా కంటెంట్ కూడా కొనసాగిస్తే వీకెండ్‌లో నంబర్లు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య రవితేజ సినిమాలకు మిస్ అయిన బలమైన ఓపెనింగ్ ‘ఇరుముడి’తో తిరిగి వస్తుందేమో చూడాలి.