Begin typing your search above and press return to search.

ఇరుముడి మూవీ నుంచి హై వోల్టేజ్ సాంగ్ 'ఇరుముడి కట్టు' అవుట్ నౌ!

రవితేజ అయ్యప్ప మాలలో కనిపిస్తున్న ఈ హార్ట్ టచింగ్ అండ్ డివోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

By:  Madhu Reddy   |   29 Jun 2026 2:28 PM IST
ఇరుముడి మూవీ నుంచి హై వోల్టేజ్ సాంగ్ ఇరుముడి కట్టు అవుట్ నౌ!
X

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’ నుంచి ఫ్యాన్స్‌కు, అయ్యప్ప భక్తులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ అయ్యప్ప మాలలో కనిపిస్తున్న ఈ హార్ట్ టచింగ్ అండ్ డివోషనల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భక్తిభావంతో సాగే సరికొత్త ట్యూన్:

అయ్యప్ప భక్తులకు ‘ఇరుముడి కట్టు’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో ఒరిజినల్ భక్తి గీతం నుంచి లిరిక్స్ తీసుకున్నప్పటికీ, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాత్రం ట్యూన్‌ను చాలా వరకు మార్చేసి సరికొత్తగా కంపోజ్ చేశారు. ఇక 'స్వామియే అయ్యప్పో.. అయ్యప్పో స్వామియే' అనే మెయిన్ లైన్స్, ఆ పాత ట్యూన్‌ని అలాగే ఉంచుతూ మిగతాదంతా వినడానికి ఎంతో ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా డిజైన్ చేశారు. ఈ పాట వింటుంటే అయ్యప్ప భక్తులకు పూనకాలు రావడం ఖాయం.

తండ్రి-కూతురు ఎమోషనల్ సెంటిమెంట్:

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం చూస్తున్న రవితేజ, ఈసారి ఒక విభిన్నమైన సబ్జెక్ట్‌తో మన ముందుకు వస్తున్నారు. ఇక అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్‌తో పాటు తండ్రి, కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ సెంటిమెంట్‌ ఈ సినిమా మెయిన్ స్టోరీ అంట. ఇందులో రవితేజ కూతురిగా నక్షత్ర నటిస్తుండగా, హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. ఇక రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గుండెకు హత్తుకునే సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నాయని టాక్.

ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్:

ఈ క్రేజీ డివోషనల్ యాక్షన్ డ్రామాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఫస్ట్ సాంగ్‌తోనే సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్‌గా మొదలయ్యాయి. ఇక శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్, రవితేజ ఎనర్జీ తోడవడంతో ఈ సినిమాతో మాస్ మహారాజా మళ్లీ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి ‘ఇరుముడి కట్టు’ పాటతో రవితేజ సినిమా అప్పుడే భక్తుల్లో, ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కమర్షియల్ సినిమాలే కాకుండా ఇలాంటి భక్తి, సెంటిమెంట్ ఉన్న కథను రవితేజ ఎంచుకోవడం ప్లస్ అని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. మరి ఆగస్టు 21న రాబోతున్న ఈ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.