Begin typing your search above and press return to search.

'ఇరుముడి' నుంచి బిగ్ అప్‌డేట్… డబ్బింగ్ ప్రారంభం, వీడియో రిలీజ్

ఈ క్రమంలోనే విడుదల చేసిన డబ్బింగ్ స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.

By:  Madhu Reddy   |   21 July 2026 12:53 AM IST
ఇరుముడి నుంచి బిగ్ అప్‌డేట్… డబ్బింగ్ ప్రారంభం, వీడియో రిలీజ్
X

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమైనట్లు అనౌన్స్ చేస్తూ, ఒక స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. రవితేజను ఒక భిన్నమైన రోల్‌లో ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా డబ్బింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం..

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు - స్పెషల్ వీడియో హల్‌చల్:

కేవలం రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ షూటింగ్ మినహా ‘ఇరుముడి’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమాను అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి పోస్ట్ ప్రొడక్షన్, రీరికార్డింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ క్రమంలోనే విడుదల చేసిన డబ్బింగ్ స్పెషల్ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక రొటీన్ మాస్ సినిమాలకు భిన్నంగా శివ నిర్వాణ ఈ కథను ఎంతో ఎమోషనల్‌గా డిజైన్ చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

అయ్యప్ప భక్తి.. తండ్రీ కూతుళ్ల అనుబంధం:

ఈ సినిమా కథా నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. రవితేజ ఇందులో అయ్యప్ప భక్తుడిగా, అలాగే కూతురిని ప్రాణంగా ప్రేమించే తండ్రిగా ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. సినిమాలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా, కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తుంది ..ఈ డబ్బింగ్ వీడియో లో రవితేజ తో పాటు ఆ పాపను కూడా చూడచ్చు. ఇక మరో కీలక పాత్రలో సాయి కుమార్ నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందిస్తున్న సంగీతం, ఇప్పటికే విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

చైతు రిజెక్ట్ చేసిన కథ.. 'మాలికప్పురం' ఫ్రీమేకా?:

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నిజానికి శివ నిర్వాణ ఈ కథను మొదట నాగచైతన్యకు వినిపించారట, కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే రవితేజ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడని టాక్.

ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎప్పుడూ లౌడ్ కామెడీ, పక్కా మాస్ యాక్షన్‌తో అలరించే మాస్ మహారాజా.. ఈసారి రూట్ మార్చి అయ్యప్ప స్వామి భక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో వస్తుండటం నిజంగానే ఒక సరికొత్త ప్రయోగం. మరి ఈ వినూత్న ప్రయత్నంతో రవితేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో, శివ నిర్వాణ ఏ రేంజ్‌లో మెప్పిస్తారో చూడాలంటే ఆగస్టు 21 వరకు ఆగాల్సిందే.