Begin typing your search above and press return to search.

‘ఇరుముడి’కి ఫస్ట్ డేనే 10 లక్షల టికెట్లు!

రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు కనిపిస్తోంది. ఉదయం షోల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ బుకింగ్స్ కు బాగానే బూస్ట్ ఇచ్చింది.

By:  M Prashanth   |   21 Aug 2026 10:38 PM IST
‘ఇరుముడి’కి ఫస్ట్ డేనే 10 లక్షల టికెట్లు!
X

రవితేజ ‘ఇరుముడి’కి మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు కనిపిస్తోంది. ఉదయం షోల తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్ బుకింగ్స్ కు బాగానే బూస్ట్ ఇచ్చింది. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ లలో కలిపి సినిమా 10 లక్షలకు పైగా (1 మిలియన్) టికెట్ల మార్క్ అందుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ కెరీర్‌లో ఇంత వేగంగా ఈ మార్క్ చేరుకున్న సినిమా ఇదేనని చిత్రబృందం చెబుతోంది.





నిజానికి రిలీజ్‌కు ముందే ‘ఇరుముడి’ బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ కనిపించింది. కానీ మార్నింగ్ షోల తర్వాత ఆ స్పీడ్ మరింత పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్‌ఫుల్ షోలు పడుతున్నాయని టీమ్ తెలిపింది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అదనపు షోలు వేయడంతో పాటు మరికొన్ని థియేటర్లు కూడా యాడ్ చేస్తున్నట్లు పేర్కొంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బుక్‌మైషోలో గంటకు అమ్ముడైన టికెట్ల లెక్కలో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘ఇరుముడి’ ఒక దశలో గంటకు 32.5 వేల టికెట్ల పీక్ నమోదు చేసింది. ఇటీవలి తెలుగు సినిమాల హవర్లీ పీక్ లిస్టులో ‘గేమ్ ఛేంజర్’, ‘దేవర’కు దగ్గరగా వెళ్లి, ‘ఓజీ’, ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ నమోదుచేసిన పీక్ నంబర్లను దాటింది. మొదటి రోజే ఈ స్థాయిలో సేల్స్ రావడం పాజిటివ్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు.

శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ పాత్రతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయిందనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా రవితేజ సినిమాలకు మాస్ ఆడియన్స్ నుంచి ముందుగా సాలిడ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ‘ఇరుముడి’ విషయంలో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మాస్ రేంజ్ లోనే థియేటర్లకు వస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు.

అయితే 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయనే నంబర్‌ అనేది మామూలు విషయం కాదు. ఈమధ్య కాలంలో రవితేజ సినిమాలలో ఇది బెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు. అదే విధంగా ప్రతి షో హౌస్‌ఫుల్, భారీగా స్క్రీన్లు పెరుగుతున్నాయనే వివరాలు కూడా పెరుగుతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. మొదటి రోజు పూర్తి కలెక్షన్స్ బయటకు వచ్చాక సినిమా ఓపెనింగ్ ఏ స్థాయిలో ఉందన్న దానిపై మరింత క్లారిటీ వస్తుంది.

ఏదేమైనా ‘ఇరుముడి’కి రిలీజ్ రోజు బుకింగ్స్ మాత్రం బలంగా ఉన్నాయి. ముందే కనిపించిన బజ్‌కు మంచి టాక్ కూడా తోడవడంతో మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద మంచి స్టార్ట్ అందుకున్నాడు. ఇప్పుడు శని, ఆదివారాల్లో ఇదే డిమాండ్ కొనసాగితే వీకెండ్ లెక్క మరింత పెద్దగా మారే అవకాశం ఉంది.