రవితేజ ఇరుముడి.. ఇది ప్లస్ అవుతుందా?
మాస్ రాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇరుముడి' సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది.
By: M Prashanth | 14 Aug 2026 11:35 AM ISTమాస్ రాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇరుముడి' సినిమా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతోంది. సరిగ్గా అదే రోజు వరలక్ష్మీ వ్రతం పండగ కూడా ఉండటంతో ఈ రిలీజ్ డేట్ బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరంగా మారింది. సినిమా కంటెంట్ ఫ్లేవర్ కి ఈ పర్టికులర్ డేట్ కాస్త ప్లస్ అయ్యేలా కనిపించడం విశేషం.
'ఇరుముడి' అనే టైటిల్ వినగానే ఇందులో ఒక డివోషనల్ టచ్ ఉందనే విషయం అర్థమవుతోంది. సినిమాలో హీరో అయ్యప్ప దీక్ష తీసుకునే పోర్షన్ చాలా కీలకంగా ఉంటుందనేది ప్రమోషనల్ విజువల్స్ చూస్తే తెలుస్తోంది. అయితే కేవలం అయ్యప్ప భక్తి అంశమే కాకుండా, అది హీరో క్యారెక్టర్ లో ఒక లేయర్ మాత్రమేనని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్, సోషల్ డ్రామా, మిస్టరీ ఎలిమెంట్స్ తో ఈ కథ సాగనుంది.
ఈ నేపధ్యంలో ఆగస్టు 21 రిలీజ్ డేట్ ని బాక్సాఫీస్ కోణంలో చూస్తే ఒక మంచి అడ్వాంటేజ్ గానే చెప్పొచ్చు. వరలక్ష్మీ వ్రతం రోజు కావడంతో పాటు వెంటనే వీకెండ్ రాబోతుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో సినిమాకి మంచి విజిబిలిటీ దక్కే ఛాన్స్ ఉంది. టైటిల్ లో ఉన్న డివోషనల్ టచ్, ఎమోషనల్ కంటెంట్ వల్ల కుటుంబ ప్రేక్షకులకు సినిమా త్వరగా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే రవితేజ సినిమాలంటే మాస్, కామెడీ, హైవోల్టేజ్ యాక్షన్ ఇమేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ 'ఇరుముడి' మాత్రం ఆ ఇమేజ్ ని మైంటైన్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్, భక్తి, మిస్టరీ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తోంది. అందుకే ఈ రిలీజ్ డేట్ సినిమా మార్కు కి సరిగ్గా సూట్ అయ్యేలా సెట్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఒక పండగ రోజున రావడం వల్ల ఫ్యామిలీస్ కి ఈవెంట్ లాంటి అట్మాస్ఫియర్ దొరుకుతుంది తప్ప, పండగ దినాన రిలీజ్ అయినంత మాత్రాన సినిమా రిజల్ట్ ఫిక్స్ అయిపోదు.
పండగ వాతావరణం కేవలం ఓపెనింగ్స్ ని, థియేటర్ల దగ్గర ఆడియన్స్ ఫెమిలియారిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన రన్ అంతా కంటెంట్ ఎలా ఉందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఏ సినిమాకైనా కేవలం రిలీజ్ డేట్ ఒక్కటే విజయానికి గ్యారంటీ ఇవ్వలేదు. ఫైనల్ గా థియేటర్లో కంటెంట్ ఎలా ఉంది, ఫస్ట్ డే మౌత్ టాక్ ఏ రేంజ్ లో వచ్చిందనే విషయాలే బాక్సాఫీస్ జాతకాన్ని డిసైడ్ చేస్తాయి. అయినప్పటికీ 'ఇరుముడి' లాంటి ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా సినిమాకి పండగ శుక్రవారం దొరకడం అనేది స్టార్టింగ్ పుష్ కి ఒక చిన్న అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.
