Begin typing your search above and press return to search.

దేవరను దాటేసిన ఇరుముడి.. ఆ లెక్కలో ఇలా.

రవితేజకు ‘ఇరుముడి’తో వచ్చిన ఈ వీక్ డే హోల్డ్ ఇప్పుడు మరింత ఉపయోగపడే విషయం.

By:  M Prashanth   |   26 Aug 2026 9:59 AM IST
దేవరను దాటేసిన ఇరుముడి.. ఆ లెక్కలో ఇలా.
X

రవితేజ ‘ఇరుముడి’ థియేటర్లలో మంచి రన్ తో వెళుతోంది. వీకెండ్ వరకు కలెక్షన్స్ రావడం ఒక ఎత్తయితే, ఆ తర్వాత వీక్ డేస్‌లో సినిమా ఎలా నిలబడుతుందన్నదే అసలు లెక్క. ఇప్పుడు బుక్‌మైషో నుంచి బయటకు వచ్చిన టికెట్ సేల్స్‌లో ‘ఇరుముడి’కి మంచి నంబర్ కనిపిస్తోంది. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తొలి మంగళవారం ఒక్కరోజే 3.55 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.

‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చింది. అంటే శుక్ర, శని, ఆదివారం వీకెండ్ పూర్తయి.. సోమవారం తర్వాత వచ్చిన ఐదో రోజు మంగళవారం ఈ 3.55 లక్షల టికెట్లు వెళ్లాయి. ఓపెనింగ్ రోజు కాకుండా ఐదో రోజు కూడా బుక్‌మైషోలో ఈ స్థాయిలో సేల్స్ రావడం మంచి విషయం. దీంతో లెక్క అసలు ఎక్కడ తగ్గట్లేదు.

ఇక్కడ మరో లెక్క కూడా ఉంది. ఇదే విధంగా ఆయా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వచ్చిన తొలి మంగళవారం బుక్‌మైషో సేల్స్ తీసుకుంటే ‘దేవర’, ‘గేమ్ ఛేంజర్’, ‘పెద్ది’, ‘ఓజీ’ కంటే ‘ఇరుముడి’ ముందుంది. ఇందులో ఎన్టీఆర్ ‘దేవర’ 2.47 లక్షలతో రెండో స్థానంలో ఉంది. దానికంటే ‘ఇరుముడి’కి లక్షకు పైగా టికెట్లు ఎక్కువగా వెళ్లాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ‘ఇరుముడి’కి ఈ నంబర్ ఐదో రోజు వచ్చింది. వీకెండ్ హడావిడి పూర్తయ్యాక కూడా మంగళవారం 3.55 లక్షల టికెట్లు అమ్ముడవడం అంటే మామూలు విషయం కాదు. పాజిటివ్ మౌత్ టాక్ సినిమా హోల్డ్‌ను బలంగా నిలబెట్టింది.

రిలీజ్ తరువాత మొదటి మంగళవారం టాప్ బుకింగ్స్

ఇరుముడి: 3.55 లక్షల టికెట్లు

దేవర: 2.47 లక్షల టికెట్లు

గేమ్ ఛేంజర్: 1.35 లక్షల టికెట్లు

పెద్ది: 1.27 లక్షల టికెట్లు

ఓజీ: 93 వేల టికెట్లు

రవితేజకు ‘ఇరుముడి’తో వచ్చిన ఈ వీక్ డే హోల్డ్ ఇప్పుడు మరింత ఉపయోగపడే విషయం. పెద్ద ఓపెనింగ్ తీసుకున్న సినిమాల పేర్లు ఉన్న లిస్ట్‌లో ఐదో రోజు టికెట్ సేల్స్‌తో ముందుండటం ఒక మంచి నంబర్. బుధ, గురువారాల్లో కూడా సినిమా ఇదే స్థాయిలో నిలబడితే రెండో వీకెండ్‌కు ముందే ‘ఇరుముడి’ రన్ ఇంకో లెవల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.