మాస్ మహారాజా సరికొత్త ప్రయత్నం
ప్రస్తుతం ఇందులో భాగంగానే `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చేస్తున్న రవితేజ దీని తరువాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్‌ని చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 17 Dec 2025 2:00 AM ISTమాస్ మహారాజా రవితేజ టైమ్ అస్సలు బాగాలేనట్టుంది. తను హిట్టు అనే మాట విని దాదాపు మూడేళ్లు కావస్తోంది. త్రినాథరావు నక్కినతో చేసిన `ధమాకా`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తరువాత నుంచి బాక్సాఫీస్‌పై హిట్టు కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. ధమాకా తరువాత మాస్ రాజా వరుసగా ఐదు ఫ్లాపుల్ని ఎదుర్కొన్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, రీసెంట్‌గా `మాస్ జాతర..
వరుస ఫ్లాపుల తరువాత తన పంథాని మార్చుకుని కొత్తగా ఫ్యామిలీ డ్రామా అందుకున్నాడు. అదే కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న `భర్త మహాశయులకు విజ్ఞప్తి`. కిషోర్ తిరుమల మార్కు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత కొంత కాలంగా రెమ్యునరేషన్ విషయంలో బెట్టు చేస్తూ వస్తున్న రవితేజ వరుస ఫ్లాపుల తరువాత కాస్త బెట్టు వీడి మెట్టు దిగినట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.
ప్రస్తుతం ఇందులో భాగంగానే `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చేస్తున్న రవితేజ దీని తరువాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ ఎమోషనల్ థ్రిల్లర్‌ని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనితో పాటు రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలిసింది. అదే మల్లిడి వశిష్ట ప్రాజెక్ట్. మెగాస్టర్‌తో సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'ని తెరకెక్కిస్తున్న వశిష్ట ఇటీవల మాస్ మహారాజాకు ఓ సైన్స్ ఫిక్షన్ స్టోరీని వినిపించారట.
స్టోరీ నచ్చడంతో రవితేజ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా తెలిసింది. రవితేజ కెరీర్‌లోనే తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరపైకి రానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సెకండ్ హాఫ్‌లో సెట్స్‌పైకి తీసుకురానున్నారని, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని కొంత మంది ప్రొడ్యూసర్లు పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఏడాది రానున్నట్టుగా తెలుస్తోంది.
