Begin typing your search above and press return to search.

ఎడిట్ రూమ్‌లోనే ఏడ్చేశాను.. రవితేజ ఎమోషనల్ స్పీచ్

ఈ సక్సెస్ కు మెయిన్ పిల్లర్స్ అయిన నిర్మాతలు నవీన్, రవిల గురించి మాట్లాడుతూ వాళ్లు తనకు ప్రొడ్యూసర్స్ లా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉంటారని చెప్పారు.

By:  M Prashanth   |   25 Aug 2026 9:40 AM IST
ఎడిట్ రూమ్‌లోనే ఏడ్చేశాను.. రవితేజ ఎమోషనల్ స్పీచ్
X

బాక్సాఫీస్ దగ్గర 'ఇరుముడి' సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీట్ లో మాస్ మహారాజా రవితేజ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ఎప్పుడూ తన ఫుల్ ఎనర్జీతో స్టేజ్ మీద సందడి చేసే ఆయన, ఈసారి మాత్రం తన మనసులోని కొన్ని పర్సనల్ ఫీలింగ్స్ ను పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు చూస్తే రవితేజ ఈ సినిమాను ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది.

బేసిక్ గా తనకు ఏడుపు రాదని, తనదొక స్టోన్ హార్ట్ అని రవితేజ ఓపెన్ గా చెప్పారు. కానీ దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను ఫస్ట్ టైమ్ ఎడిట్ రూమ్ లో చూపించినప్పుడు మాత్రం తను ఆల్మోస్ట్ చోక్ అయిపోయానని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడూ అంత త్వరగా ఏడ్వని తాను కూడా ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయిపోయానని, ఆ క్యారెక్టరైజేషన్ తనను అంతలా కదిలించిందని అన్నారు. స్క్రిప్ట్ లో ఉన్న ఆ సోల్ వల్లే తాను కూడా అలా ఇన్వాల్వ్ అయ్యానని క్లారిటీ ఇచ్చారు.

అసలు ఇలాంటి రూటెడ్ కథలు చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో కూడా రవితేజ క్లియర్ గా చెప్పారు. కరోనా పాండమిక్ టైమ్ లో ఇంట్లో ఉన్నప్పుడు ఓటీటీలో ఎక్కువగా మలయాళం సినిమాలు, అలాగే తమిళ్ లో వెట్రిమారన్ లాంటి వాళ్లు తీసిన సినిమాలు చూశారట. ఆ కంటెంట్ చూసినప్పుడు "యమ్మా.. మనం కూడా ఇలాంటి సినిమాలు కచ్చితంగా చేయాలి కదా" అని ఆయన బలంగా అనుకున్నానని చెప్పారు. ఆ కోరిక ఇరుముడితో నెరవేరిందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

సినిమా చూసిన జనాల రియాక్షన్స్ తనకెంతో తృప్తిని ఇస్తున్నాయని ఆయన అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెబుతూ.. ఒక ఫ్రెండ్ వాళ్ల తాతయ్య, నానమ్మ వయసు 80 ఏళ్లు దాటిందట. వాళ్లు పాతికేళ్లుగా థియేటర్ల వైపు వెళ్లలేదని, కానీ ఇప్పుడు కేవలం ఇరుముడి సినిమా కోసం వాళ్లు థియేటర్ కు వెళ్లి మరీ చూశారని రవితేజ పంచుకున్నారు. ఇలాంటి మాటలు వింటుంటే తనకు కలిగేది మామూలు ఆనందం కాదని ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు.

ఈ సక్సెస్ కు మెయిన్ పిల్లర్స్ అయిన నిర్మాతలు నవీన్, రవిల గురించి మాట్లాడుతూ వాళ్లు తనకు ప్రొడ్యూసర్స్ లా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉంటారని చెప్పారు. రిలీజ్ రోజు నవీన్ వచ్చి డైరెక్టర్ శివను హగ్ చేసుకుంటే, కింగ్ కాంగ్ సినిమా గుర్తొచ్చిందని నవ్వించారు. అదే ఫ్లోలో "మీకు ఎందుకు లేవు ఆ హగ్స్.. రండి" అని ప్రొడ్యూసర్స్ ఇద్దరినీ స్టేజ్ మీదకు పిలిచి మరీ బ్లాక్ బస్టర్ హగ్స్ ఇచ్చారు.

ఒక స్టార్ హీరో తన రెగ్యులర్ కమర్షియల్ మీటర్ ను పక్కనపెట్టి, ఇలాంటి రూటెడ్ ఎమోషనల్ కథను నమ్మి చేసిన ప్రయోగానికి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దక్కిన రిజల్ట్ ఒక బెస్ట్ ఆన్సర్ లా నిలిచింది. శివ నిర్వాణ టేకింగ్ వలనే ఇరుముడి జనాలకు అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిందనీ రవితేజ అన్నారు. అలాగే సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు బాగా వర్క్ చేశారని అన్నారు.