Begin typing your search above and press return to search.

వరుస అనౌన్స్మెంట్స్ ఓకే.. మరి ఇప్పటికైనా గాడిన పడతారా?

మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫుల్ ఎనర్జీ.. వరుస సినిమాలతో దూసుకుపోవడం ఆయన స్టైల్.

By:  Madhu Reddy   |   20 Jun 2026 5:00 PM IST
వరుస అనౌన్స్మెంట్స్ ఓకే.. మరి ఇప్పటికైనా గాడిన పడతారా?
X

మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫుల్ ఎనర్జీ.. వరుస సినిమాలతో దూసుకుపోవడం ఆయన స్టైల్. అయితే గత కొంతకాలంగా ఆయనకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ పాత స్పీడ్ అందుకోవడానికి రవితేజ కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే రెండు భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఒక క్రేజీ నిర్మాతతో, మరో విలక్షణ దర్శకుడితో రాబోతున్న ఈ సినిమాలు ఆయన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెస్తాయని ఫాన్స్ గట్టిగ నమ్ముతున్నారు ..మరి ఆ విశేషాలు చూద్దాం..

దిల్ రాజు బ్యానర్‌లో మాస్ జాతర:

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రవితేజ చేయబోయే కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక వేగంగా జరుగుతున్నాయి. రవితేజను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. దానికి తగ్గట్టుగా ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ కథను సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తోంది.

వివేక్ ఆత్రేయతో ఊహించని కాంబినేషన్:

ఆగస్టులో దిల్ రాజు సినిమా మొదలైన రెండు నెలలకే.. అంటే అక్టోబర్ నుంచి రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ఉన్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటివరకు క్లాస్ అండ్ కంటెంట్ సినిమాలే తీసిన వివేక్.. మొదటిసారి రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, ఎమోషన్స్,కామెడీ మేళవించి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ రాసుకున్నారట.

ప్లాపుల్లో ఉన్నా తగ్గని రవితేజ మార్కెట్:

ఇటీవల రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. గత ఏడాది వచ్చిన ‘మాస్ జాతర’ కానీ, ఈ ఏడాది విడుదలైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఐనా సరే మాస్ మహారాజా క్రేజ్ అస్సలు తగ్గలేదు. ఇక ఆయన మార్కెట్‌పై నమ్మకంతో ఇప్పటికీ టాలీవుడ్ టాప్ నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి లైన్ కడుతున్నారు.

ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే:

వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు లైన్‌లో పెట్టడం రవితేజ స్పీడ్‌కు నిదర్శనమే అయినా.. ప్రస్తుతం ఆయనకు ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ చాలా అవసరం. రాబోతున్న 'ఇరుముడి' చిత్రంతో పాటు దిల్ రాజు, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రాబోయే ఈ రెండు కొత్త సినిమాల్లో కనీసం ఒకటైనా గట్టిగా హిట్ కొడితేనే రవితేజ మళ్లీ ఫుల్ ఫేమ్‌లోకి వస్తారని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

వరుస అనౌన్స్మెంట్స్, షూటింగులతో రవితేజ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం వచ్చిన మాట నిజమే. కానీ కేవలం స్పీడ్ మాత్రమే కాదు, ఈసారి కంటెంట్ కూడా గట్టిగా ఉంటేనే మాస్ మహారాజా బాక్సాఫీస్ వద్ద పాత వైభవాన్ని అందుకుంటారు. మరి ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్టులు రవితేజను మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో వేచి చూడాలి..