Begin typing your search above and press return to search.

మాస్ మ‌హారాజా సినిమాల వెనుక కొత్త ఇన్‌ఫ్లుయెన్స్!

రవితేజ హీరోగా రూపొందిన ఇరుముడికి మోక్ష‌ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Aug 2026 11:41 AM IST
మాస్ మ‌హారాజా సినిమాల వెనుక కొత్త ఇన్‌ఫ్లుయెన్స్!
X

సినీ ఫ్యామిలీల నుంచి వచ్చే వారసత్వం అంటే ఇప్పటివరకు హీరోలు, హీరోయిన్లుగానే తెరపైకి రావడం ఎక్కువగా కనిపించేది. ముఖ్యంగా స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా పరిచయం కావడం మామూలే. అయితే కాలం మారుతున్న కొద్దీ స్టార్ కిడ్స్ కెరీర్ సెలెక్ష‌న్ లోనూ మార్పు కనిపిస్తోంది. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేకపోయినా సినిమాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదనే ఆలోచన ఈ కొత్త త‌రంలో బలపడుతోంది. ప్రొడక్షన్, క్రియేటివ్, రైటింగ్, డైరెక్ష‌న్ వంటి విభాగాల వైపు అడుగులు వేస్తున్న వారసులు ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తున్నారు. మాస్ మ‌హారాజా రవితేజ కూతురు మోక్ష‌ద జ‌ర్నీ కూడా ఇదే మార్పుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.

రవితేజ కొడుకు మ‌హాధ‌న్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్ లో వ‌ర్క్ చేస్తున్నాడు మ‌హాధ‌న్. మరోవైపు ర‌వితేజ కూతురు మోక్ష‌ద మాత్రం కెమెరా ముందు కనిపించే దారిని ఎంచుకోకుండా, సినిమా వెనుక ఉండే బాధ్యతలను స్వీకరించి ఇరుముడి ప్రాజెక్టు ద్వారా ఎంట్రీ ఇచ్చి సినిమా స‌క్సెస్ లో భాగ‌మైంది.

రవితేజ హీరోగా రూపొందిన ఇరుముడికి మోక్ష‌ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోక్ష‌ద కేవ‌లం ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా మాత్ర‌మే కాకుండా సినిమాకు సంబంధించిన కొన్ని కీలక అంశాల్లో ఆమె చురుకుగా భాగమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్క‌ష‌న్ జరుగుతోంది. ముఖ్యంగా ర‌వితేజ‌ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నమైన కథను ఎంచుకోవడంలో కూడా ఆమె అభిప్రాయానికి ప్రాధాన్యం లభించినట్లు తెలుస్తోంది.

దీంతో ఫ్యూచ‌ర్ లో రవితేజ సినిమాల ఎంపిక విషయంలో కూడా మోక్ష‌ద ప్రభావం ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది. అలా అని ర‌వితేజ ఫ్యూచ‌ర్ సినిమాల‌ను మోక్ష‌ద‌నే డిసైడ్ చేస్తార‌ని కాదు. తండ్రి సెలెక్ష‌న్ తో మ‌రియు, తండ్రితో కలిసి కథలు, ప్రాజెక్టుల గురించి చర్చించే స్థాయిలో సినిమా అవగాహన పెంచుకుంటుంద‌నే విష‌యం మాత్రం ఆసక్తికరంగా మారింది.

మోక్ష‌ద యాక్టింగ్ వైపు ఎందుకు వెళ్లలేదనే దానికంటే, యాక్టింగ్ లోకి రాకుండానే సినీ రంగంలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకోవాలనుకోవడమే ఇక్క‌డ అంద‌రికీ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అంటే స్టార్ హీరో కూతురు కావడం వల్ల హీరోయిన్‌గా మారాల్సిందే అనే పాత అంచనాలకు భిన్నంగా ఆమె కెరీర్‌ను నిర్మించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరుముడి మోక్ష‌దకు కేవలం ఒక మూవీ ఎక్స్‌పీరియెన్స్ గా మిగులుతుందా? లేక ప్రొడక్షన్, క్రియేటివ్ విభాగాల్లో ఆమెకు ఇదే తొలి మెట్టుగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్యూచ‌ర్ లో ఆమె మరిన్ని ప్రాజెక్టుల్లో ఇదే తరహా బాధ్యతలు స్వీకరిస్తే, రవితేజ వారసత్వం తెరపై మాత్రమే కాకుండా తెర వెనుక కూడా కొనసాగుతున్నట్టే అవుతుంది.