ఆ టాలెంటెడ్ డైరెక్టర్ తో మాస్ మహారాజా మూవీ?
అయినప్పటికీ రవితేజ ఫలితంతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా రాబోతుంది.
By: Sravani Lakshmi Srungarapu | 31 Dec 2025 4:10 PM ISTమాస్ మహారాజా రవితేజ గత కొన్ని సినిమాలుగా వరుస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన ధమాకా తప్పించి ఆ తర్వాత అతన్నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశ పరుస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ రవితేజ ఫలితంతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా రాబోతుంది.
సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి
కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించగా, సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని రవితేజ భావిస్తున్నారు. అందుకే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఫలితం మాస్ మహారాజాకు ఎంతో కీలకం కానుంది.
శివ నిర్వాణతో రవితేజ మూవీ
ఈ సినిమా తర్వాత రవితేజ, శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, దీనికి ఇరుముడి అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. శివ నిర్వాణ మూవీతో పాటూ రవితేజ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
రవితేజకు కథ చెప్పిన వివేక్ ఆత్రేయ
విభిన్న జానర్లలో సినిమాలు తీసి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. సరిపోదా శనివారం తర్వాత వివేక్ ఎవరితో సినిమా చేస్తాడా అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ రీసెంట్ గా వివేక్ రవితేజను కలిసి ఓ కథ చెప్పారని, ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. శివ నిర్వాణ సినిమా అయిపోయాకే వివేక్ ఆత్రేయ సినిమా పట్టాలెక్కుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వివేక్ రవితేజకు ఎలాంటి సినిమాను ఇస్తారో చూడాలి.
