ఫ్యాన్స్ కు మాస్ మహారాజా ఇచ్చిన క్రేజీ ప్రామిస్
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 17 Aug 2026 9:34 AM ISTమాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి ఆగస్టు 21న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదిక మీద రవితేజ మాట్లాడిన మాటలు ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. ఇక సినిమా రిజల్ట్ పై ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో క్లియర్ గా అర్థమవుతోంది. తన కెరీర్ లోనే ఇదొక స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని ఆయన బలంగా నమ్ముతున్నాడు.
డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా తెరకెక్కించాడు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, గుండెను హత్తుకునే సెంటిమెంట్ అంశాలను కథలో బాగా బ్లెండ్ చేశాడట. ముఖ్యంగా ఆడపిల్లల రక్షణ అనే ఒక సెన్సిటివ్ పాయింట్ చుట్టూ ఈ స్టోరీ నడుస్తుందని డైరెక్టర్ చెప్పాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ కాకుండా ఒక ఇంటెన్స్ సీరియస్ డ్రామాను దర్శకుడు డీల్ చేసిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ గురించి డైరెక్టర్ చెబుతున్న మాటలు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి. ఆయన యాక్టింగ్ చూసి తనకు చాలా చోట్ల గూస్ బంప్స్ వచ్చాయని శివ నిర్వాణ అన్నాడు. సినిమాలో నటించిన బేబీ నక్షత్ర, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారని చెప్పాడు. ఇక విష్ణు శర్మ కెమెరా వర్క్ సినిమా మూడ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయిందని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన పాటలు ఇచ్చాడని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే బయటకు వచ్చిన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ జనాలకు బాగా రీచ్ అయ్యాయి. ముఖ్యంగా మల్లెపూల పల్లకి అనే కొత్త పాటను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేశారు. దానికి ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కంటెంట్ అంతా చూస్తుంటే సినిమా మీద అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి.
సినిమా ఫైనల్ ఎడిట్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండానే తాను చూశానని రవితేజ చెప్పాడు. అలా చూసినప్పుడే ప్రతి సెకన్ తనకు ఎంతగానో నచ్చేసిందని అన్నాడు. ఆగస్టు 21 నుంచి థియేటర్లలో ఆడియన్స్ అంతా ఒక కొత్త రవన్నను చూస్తారని ఫ్యాన్స్ కు ప్రామిస్ చేశాడు. రవితేజ లాంటి స్టార్ ఈ రేంజ్ లో గ్యారెంటీ ఇస్తున్నాడంటే కంటెంట్ లో స్టఫ్ గట్టిగానే ఉన్నట్టు లెక్క వేసుకోవచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా భారీగా నిర్మించారు. ఆ నిర్మాతలు తనకు చాలా క్లోజ్ అని రవితేజ చెప్పాడు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని, అందుకే ఇక్కడ ఎక్కువ మాట్లాడకుండా మిగతా విషయాలన్నీ సక్సెస్ మీట్ లోనే పంచుకుంటానని అన్నాడు. డైరెక్టర్ వర్క్ ను కూడా ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మొత్తానికి ఇరుముడి టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర గట్టి సౌండ్ చేసేలానే ఉన్నారు.
