మాస్ రాజా ఇది కదా లైనప్ అంటే..!
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా తర్వాత రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సీరియస్ స్టోరీ చేస్తున్నారట.
By: Ramesh Boddu | 25 Jan 2026 10:36 AM ISTమాస్ మహారాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. సంక్రాంతి సినిమాల పోటీలో రవితేజ సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. అందుకే అంత ఫైట్ లో కూడా సినిమా ఆడియన్స్ ని మెప్పించగలిగింది. అఫ్కోర్స్ మిగతా సినిమాలు కూడా బాగా మెప్పించాయని తెలిసిందే. రవితేజ ఈమధ్య వరుస ఫ్లాప్ లతో కాస్త వెనకబడి ఉన్నాడు. ఆయనకు ఈ రిజల్ట్ కాస్త జోష్ ఇచ్చిందని చెప్పొచ్చు. తన నుంచి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంటర్టైనింగ్ సినిమాలు ఆశిస్తున్నారని ఈ రిజల్ట్ తో అర్ధమైంది.
రవితేజ శివ నిర్వాణ ఒక సీరియస్ స్టోరీ..
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా తర్వాత రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సీరియస్ స్టోరీ చేస్తున్నారట. సెంటిమెంట్, ఎమోషన్ విత్ యాక్షన్ ఇంటెన్స్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడట. ఆల్రెడీ కథా చర్చలు కూడా ముగిశాయని తెలుస్తుంది.
నానితో అంటే సుందరానికి, సరిపోదా శనివారం రెండు సినిమాలు చేశాడు వివేక్ ఆత్రేయ. యువ దర్శకుల్లో ప్రతిభ గల ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా అసలైతే రజనీకాంత్, సూర్య లాంటి స్టార్స్ తో ప్లాన్ చేసుకున్నాడు. ఐతే ఇప్పుడు రవితేజతో సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. రవితేజ కూడా వివేక్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.
సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్న వివేక్..
నానితో సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్న వివేక్ నెక్స్ట్ సినిమాకు కాస్త టైం తీసుకుంటున్నాడు. రవితేజ తో వివేక్ సినిమా కూడా చాలా రీఫ్రెషింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ ఇలా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో రవితేజ సినిమాలు చేయడం మాస్ రాజా ఫ్యాన్స్ ని కూడా ఖుషి అయ్యేలా చేస్తుంది.
మాస్ జాతర వరకు తన మాస్ సినిమాలతో ఫ్యాన్స్ ని అలరించాలని చూసిన రవితేజ ఇక మీదట డిఫరెంట్ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే శివ నిర్వాణతో ఒక క్రైం థ్రిల్లర్, వివేక్ తో మరో ఇంట్రెస్టింగ్ సినిమా తో వస్తున్నారని తెలుస్తుంది. సినిమా హిట్టైనా ఫ్లాప్ అయినా రవితేజ మరో సినిమా చేస్తాడు.. నేనింతే సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ లానే సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంటారు మాస్ రాజా.
రాబోతున్న ఈ రెండు సినిమాలు కచ్చితంగా ఆయన ఫ్యాన్స్ నే కాదు సినీ ప్రియులను అలరించేలా ఉంటాయని చెప్పొచ్చు. శివ నిర్వాణ ఆఫ్టర్ గ్యాప్ చేస్తున్న సినిమా కాబట్టి సబ్జెక్ట్ మీద చాలా ఫోకస్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే రవితేజ శివ నిర్వాణ సినిమా మొదలు కాబోతుందని టాక్.
