Begin typing your search above and press return to search.

రవి మోహన్‌లో మళ్లీ ఆ చిరునవ్వు.. వైరల‌వుతున్న డ్యాన్స్ వీడియో!

రవి మోహన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ వివాదాలే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్క‌ష‌న్‌కు వస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   3 Aug 2026 1:09 PM IST
రవి మోహన్‌లో మళ్లీ ఆ చిరునవ్వు.. వైరల‌వుతున్న డ్యాన్స్ వీడియో!
X

రవి మోహన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు, కోర్టు వ్యవహారాలు, కుటుంబ వివాదాలే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎక్కువగా డిస్క‌ష‌న్‌కు వస్తున్నాయి. అలాంటి టైమ్ లో ఆయన షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో ఫ్యాన్స్ కు పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇచ్చింది. ఇంట్లోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన రవి మోహన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఆయన ఫేస్‌లో కనిపించిన ఆనందాన్ని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియోలో రవి మోహన్ రెడ్ క‌ల‌ర్ బ‌ట్ట‌ల్లో కనిపించడం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆదివారం రోజున తప్పనిసరిగా ఎరుపు రంగు బ‌ట్టలు ధరించడం తనకు స్కూల్ రోజుల నుంచే అలవాటుగా మారిందని ఆయన గతంలో చెప్పిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. అదే అలవాటును కొనసాగిస్తూ ఈసారి కూడా రెడ్ కలర్ డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించడం వీడియోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ఈ ఆనందానికి కారణం కూడా ఆయన తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు. నటుడిగా ఎన్నో స‌క్సెస్‌లు సాధించిన రవి మోహన్ ఇప్పుడు డైరెక్ట‌ర్ గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొద‌టి సినిమా యాన్ ఆర్డిన‌రీ మ్యాన్ లో యోగి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సీన్స్, ఒక సాంగ్ ను ఆయన ఇటీవల తన ఫ్యామిలీ మెంబ‌ర్స్ కు చూపించ‌గా, అది చూసిన తర్వాత తల్లిదండ్రులు, అన్న మోహన్ రాజా తనను అభినందించడం ఎంతో ఎమోష‌న‌ల్ గా అనిపించిందని రవి మోహన్ పేర్కొన్నారు. ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రోత్సాహమే తనకు గొప్ప గిఫ్ట్ గా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తండ్రి ఇచ్చిన ప్రశంస ప్రతి బిడ్డకు దక్కాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అదే పోస్టులో ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోతో పాటు డ్యాన్స్ వీడియోను కూడా షేర్ చేస్తూ ర‌వి మోహ‌న్ దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వీడియోపై అభిమానుల రెస్పాన్స్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇలానే నవ్వుతూ ఉండండి అని కొంద‌రు కామెంట్ చేస్తుంటే, మీ ముఖంలో ఇప్పుడు నిజమైన ఆనందం కనిపిస్తోందని మ‌రికొంద‌రు, మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటూ ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఆయన గతంలో ఎమోష‌న‌ల్ అయిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు తిరిగి ఆనందంగా కనిపించడం తమకు సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంటున్నారు.

డైరెక్ట‌ర్ గా తొలి ప్రయత్నానికి ఫ్యామిలీ నుంచి లభించిన ప్రశంసలను సంబరంగా మార్చుకున్న రవి మోహన్, ఒక సాధారణ డ్యాన్స్ వీడియోతోనే అభిమానుల్లో కొత్త ఆశలు నింపారని చెప్పొచు. వ్యక్తిగత వివాదాల కంటే తన క్రియేటివ్ జ‌ర్నీ, ఫ్యామిలీ స‌పోర్ట్, జీవితాన్ని సానుకూలంగా స్వీకరించే తన మనస్తత్వమే ఇప్పుడు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుకునే అంశాలుగా మారాయి.