Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ కోలీవుడ్ హీరో స్పీడు

ఇప్పుడు మ‌రో కోలీవుడ్ న‌టుడు సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌డంతో పాటూ డైరెక్ట‌ర్ గా కూడా మార‌నున్న‌ట్టు తెలిపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 Aug 2025 4:00 PM IST
ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ కోలీవుడ్ హీరో స్పీడు
X

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రెప్పుడు ఎలా మారిపోతారో ఎవ‌రూ చెప్ప‌లేం. అప్ప‌టివ‌ర‌కు హీరోలుగా ఉన్న వాళ్లు స‌డెన్ గా డైరెక్ట‌ర్లుగా, నిర్మాత‌లుగా మారి సినిమాల‌ను తీస్తూంటారు. ఇప్ప‌టికే ప‌లువురు హీరోలు నిర్మాత‌లుగా, డైరెక్ట‌ర్లుగా మారి త‌మ స‌త్తా చాటుకుంటే ఇప్పుడు మ‌రో కోలీవుడ్ న‌టుడు సొంత నిర్మాణ సంస్థ‌ను స్థాపించ‌డంతో పాటూ డైరెక్ట‌ర్ గా కూడా మార‌నున్న‌ట్టు తెలిపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ర‌వి మోహ‌న్ స్టూడియోస్ పేరిట బ్యాన‌ర్

అత‌ను మ‌రెవరో కాదు, టాలీవుడ్ టాలెంటెడ్ న‌టుడు ర‌వి మోహ‌న్. అంద‌రికీ జ‌యం ర‌విగా ఆయ‌న ప‌రిచ‌యం. రీసెంట్ గా ఆయ‌న పేరు మార్చుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే సొంత నిర్మాణ సంస్థ అయిన ర‌వి మోహ‌న్ స్టూడియోస్ ను ఆవిష్క‌రిస్తూ ఓ ఈవెంట్ నిర్వ‌హించ‌గా ఆ ఈవెంట్ కు కార్తీ, శివ కార్తికేయ‌న్, శ్ర‌ద్ధా శ్రీనాథ్, శివ రాజ్‌కుమార్ హాజ‌ర‌య్యారు.

మొద‌టి సినిమాగా బ్రో కోడ్

ఆ ఈవెంట్ లో త‌న బ్యాన‌ర్ లో మొద‌టిగా వ‌స్తోన్న సినిమాకు బ్రో కోడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్టు అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ర‌వి మోహ‌న్, ఎస్‌జె సూర్య న‌టించ‌నుండ‌గా బ్రో కోడ్ సినిమాకు కార్తీక్ యోగి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. దీంతో పాటూ ర‌వి మోహ‌న్ తాను డైరెక్ట‌ర్ గా అరంగేట్రం చేయాల‌ని ఆ సినిమాను కూడా సొంత బ్యాన‌ర్‌లోనే ప్లాన్ చేస్తున్నారు.

మెగా ఫోన్ ప‌ట్ట‌నున్న ర‌విమోహ‌న్

ర‌వి మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమాలో యోగి బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా యాన్ ఆర్టిన‌రీ మ్యానే అనే టైటిల్ తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. న‌టుడిగా ఎన్నో సినిమాలు చేసిన ర‌వి మోహ‌న్ కు డైరెక్ట‌ర్ గా ఇదే మొద‌టి సినిమా. కొత్త బ్యాన‌ర్ ను స్టార్ట్ చేయ‌డ‌మే కాకుండా అందులో ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయ‌డంతో ర‌వి మోహ‌న్ స్పీడు చూస్తుంటే త‌న బ్యాన‌ర్ లో మ‌రిన్ని మంచి సినిమాలు నిర్మించాల‌ని ఆయ‌న టార్గెట్ పెట్టుకున్నట్టు అనిపిస్తోంది.