మరోసారి ప్రియురాలితో కనిపించిన రవి మోహన్
తమిళ నటుడు రవిమోహన్ మరోసారి తన ప్రేయసి, సింగర్ కెనీషాతో బహిరంగంగా కనిపించారు.
By: Sravani Lakshmi Srungarapu | 15 Sept 2025 1:45 PM ISTతమిళ నటుడు రవిమోహన్ మరోసారి తన ప్రేయసి, సింగర్ కెనీషాతో బహిరంగంగా కనిపించారు. అయితే ఈసారి వారిద్దరూ కలిసి కనిపించింది ఇండియాలో కాదు, దుబాయ్‌లో. రవిమోహన్, కెనీషా కలిసి ఆదివారం జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ చూడ్డానికి యూఏఈ వెళ్లారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించగా ఆ మ్యాచ్ కు వెళ్లి రవి మోహన్, కెనీషా ఎంజాయ్ చేశారు.
ఇంకా విచారణలోనే ఉన్న రవిమోహన్- ఆర్తి విడాకుల కేసు
దానికి సంబంధించిన ఫోటోను స్వయంగా కెనీషా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఓ వైపు భార్య ఆర్తితో రవి మోహన్ విడాకుల కేసు విచారణ జరుగుతుండగా వీరిద్దరూ మాత్రం ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే కలిసి కనిపించారు. రవి మోహన్- కెనీషా గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారని, కెనీషా వల్లే తన వైవాహిక బంధం దెబ్బతిందని ఆర్తి మొదటినుంచి ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
కాన్సర్ట్ కోసం దుబాయ్ వెళ్లిన కెనీషా
అయితే కెనీషా పోస్టులను బట్టి చూస్తే ఆమె కేవలం రవి మోహన్ తో కలిసి క్రికెట్ మ్యాచ్ ను చూడ్డానికి మాత్రమే దుబాయ్ వెళ్లినట్టు కనిపించడం లేదు. అక్కడ ఆమెకు ఓ ఈవెంట్ ఉండటం వల్లనే ఆమె దుబాయ్ కు వెళ్లారని తెలుస్తోంది. కెనీషా ఓ కాన్సర్ట్ కోసం దుబాయ్ వెళ్లగా ఆమెకు అక్కడ ఓ వింత అనుభవం ఎదురైనట్టు తన పోస్టుల్లో రాసుకొచ్చారు.
ఆర్గనైజర్ మోసం చేసిందని పోస్టులు
తనను మరియు తనతో పాటూ ఎంతో మంది కళాకారులను ఈవెంట్ ఆర్గనైజర్ మెర్లిన్ మోసం చేశారని, వారి పెర్ఫార్మెన్స్ కు తగ్గ రెమ్యూనరేషన్ మెర్లిన్ వారికి ఇవ్వలేదని ఆమె తన పోస్టుల్లో ఆరోపించారు. ప్రముఖ హోస్ట్, నటి అంజనా రంగన్ కు కూడా మెర్లిన్ రెమ్యూనరేషన్ చెల్లించలేదని, కనీసం తన ఫుడ్, ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులివ్వలేదని కెనీషా రాసుకొచ్చారు. కెనీషా పోస్టులను బట్టి చూస్తుంటే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ మినహా ఆమె దుబాయ్ ట్రిప్ తనకు నిరాశనే మిగిల్చిందని అర్థమవుతుంది.
