దేవుడిని మోసం చేయలేవంటూ నటుడి భార్య పోస్టు
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(జయం రవి) గత కొంత కాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 26 Aug 2025 2:44 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్(జయం రవి) గత కొంత కాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. భార్యకు కూడా తెలియకుండా విడాకులు ప్రకటించిన ఆయన, ఆ తర్వాత తన పేరును రవి మోహన్ గా మార్చుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. ఆర్తితో విడాకులు ప్రకటించాక సింగర్ కెనీషాతో కలిసి ఎక్కువగా బయట కనిపిస్తూ వస్తున్నారు రవి మోహన్.
తిరుమలో కెనీషాతో రవి మోహన్
ఇప్పటికే రవి మోహన్, కెనీషా కలిసి పలుసార్లు బయట కనిపించగా, రీసెంట్ గా వారిద్దరూ కలిసి తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దర్శనానికి వెళ్లిన వారి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్తితో విడాకుల వివాదం కొనసాగుతుండగానే కెనీషాతో కలిసి రవి మోహన్ పదే పదే పబ్లిక్ కనిపించడం, పెళ్లిళ్లకు, పలు పార్టీలకు, గుడికి కూడా కలిసి వెళ్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది.
దేవుడిని మోసం చేయలేవు
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆర్తి రీసెంట్ గా తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చేశారు. నువ్వు ఇతరులను మోసం చేయొచ్చు, నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేవంటూ ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ జయం రవి- కెనీషా తిరుమల టూర్ ను ఉద్దేశిస్తూ పెట్టిందే అని అందరూ భావిస్తున్నారు.
నెలకు రూ.40 లక్షల భరణం డిమాండ్
గతంలో కూడా ఆర్తి పిల్లలను ఉద్దేశిస్తూ ఓ నోట్ ను షేర్ చేశారు. బెస్ట్ పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల కోసమే ఆలోచిస్తారని, అమాయకులైన పిల్లల్ని అందరూ ప్రేమిస్తారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుకోండి అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం రవి మోహన్, ఆర్తి విడాకుల కేసు కోర్టులో ఉండగా, భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశారు.
కెనీషా వల్లే సమస్యలు
అయితే సింగర్ కెనీషా, రవి మోహన్ ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు కెనీషా వల్లే తమ వైవాహిక జీవితంలో సమస్యలొచ్చాయని, ఆమె రాకముందు తమ లైఫ్ చాలా బావుందని ఆర్తి ఆరోపణలు చేశారు. కానీ రీసెంట్ గా తాను ఆర్తితో కలిసి ఉండలేనని రవి మోహన్ కోర్టుకు వివరించగా, ఆమె తన భర్త నుంచి భరణం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
