షాకింగ్ వీడియో: తనతో తానే మాట్లాడుకుంటున్న స్టార్ హీరో
ఇటీవల కొంత కాలంగా నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తితో వైవాహిక సమస్యలను ఎదుర్కోవడం మీడియాలో హైలైట్ అయిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 6 Dec 2025 9:46 AM ISTఇటీవల కొంత కాలంగా నటుడు రవి మోహన్ తన భార్య ఆర్తితో వైవాహిక సమస్యలను ఎదుర్కోవడం మీడియాలో హైలైట్ అయిన సంగతి తెలిసిందే. రవి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాక గొడవ పెద్దదైంది. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటూ, ఒకరినొకరు టీజ్ చేస్తూ మీడియాకు వినోదాన్ని పంచుతున్నారు.
అయితే భార్యాభర్తల పంచాయితీ కోర్టు పరిధిలో ఉన్నందున ఇరువురూ ఇలా బహిరంగంగా వాగ్వాదాలకు, బాహాబాహీకి దిగ కూడదని, చట్టరీత్యా తగదని కోర్టు అక్షింతలు వేసాక, సీన్ కొంత శాంతించింది.
కొద్దిరోజులుగా సైలెన్స్ కొనసాగినా కానీ, ఇప్పుడు రవి మోహన్ భార్య క్రిప్టిక్ ఇన్ స్టా పోస్ట్ మరోసారి చర్చగా మారింది. ఈ పోస్ట్ ప్రకారం.. ``పందితో పోరాడకండి... మీరు బురదలో చిక్కుకుంటారు.. కానీ పంది బురదను ఆస్వాధిస్తుంది`` అనే అర్థం వచ్చే కోట్ ని ఆర్తి సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఎవరి పేరును స్పష్టంగా ప్రస్తావించకపోయినా అది తన భర్తను ఉద్దేశించి ఆర్తి చేసిన పోస్ట్ అని అందరికీ అర్థమైంది.
ఇంతలోనే ఇప్పుడు రవి మోహన్ దీనికి కౌంటర్ పోస్ట్ ని ఇన్‌స్టాలో రిలీజ్ చేసారు. తాజా ఇన్ స్టా వీడియోలో రవి మోహన్ తనతో తానే మాట్లాడుకుంటూ ఆచేతనంగా కనిపించాడు. చేతిలో ఒక మందు గ్లాస్ కూడా కనిపించింది. తనలో తాను తనతో తాను మాట్లాడుతూ మత్తులో అటూ ఇటూ జోగుతున్నాడు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోకి రవి ఇచ్చిన కోట్ సారాంశం ఇలా ఉంది. ``ఈ రోజుల్లో నేను నాతో నేనే మాట్లాడుకుంటున్నాను. నేను సరిగా జీవించని సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. నేను ఎక్కువగా నమ్మిన వారు నన్ను నాశనం చేసారు. కానీ వారు నన్ను మరింత బంగారు రంగులోకి మారడానికి నాకు అన్ని విధాలా స్వేచ్ఛను ఇచ్చారు. నిజం ఏమిటంటే.. నేను నాశనం అవ్వను.. నన్ను నేను పునర్నిర్మించుకుంటాను`` అని క్యాప్షన్ లో రాసారు.
రవి మోహన్- ఆర్తి మధ్య వైవాహిక సమస్యలు గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారాయి. భార్యాభర్తల నడుమ విభేదాలు పెరిగాక విడివిడిగా నివశిస్తున్నారు. తరువాత రవి మోహన్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. అతడికి విడాకులు ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని భార్య ఆర్తి వాదిస్తున్నారు. గాయని కెనిషాతో అతడి ఎఫైర్ గురించి ఆర్తి నిలదీస్తోంది. అటుపై సినీపరిశ్రమ నుంచి ఖుష్బూ, రాధిక లాంటి కొందరు రవి భార్య ఆర్తికి అండగా నిలవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి కొనసాగింపుగా, పందితో పోలుస్తూ రవి- కెనీషాను ఆర్తి కామెంట్ చేసిందని తాజా ఇన్ స్టా పోస్ట్ వెల్లడించింది. అయితే తనతో ఇతరులు ఎవరూ లేరు..ఎవరికీ బురద అంటదు! అనే అర్థం వచ్చేలా సోలోగా తనతో తాను తనలో తాను మాట్లాడుకుంటున్న వీడియోను రవి మోహన్ కౌంటర్ గా పోస్ట్ చేసారు. ఇది భార్యా భర్తల నడుమ గొడవలో పరాకాష్ఠ అంటూ రవి మోహన్ అభిమానులు ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు.
