హీరో లేడు తెలిసిన ఫేస్ లేదు.. అయినా సినిమా ఎందుకు చూడాలంటే..
కొత్త వాళ్లతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ది రెడ్ బ్యాగ్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
By: M Prashanth | 22 Jun 2026 10:17 AM ISTకొత్త వాళ్లతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ది రెడ్ బ్యాగ్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మౌనిక, స్నేహా సింగ్ లాంటి యంగ్ టాలెంటెడ్ కాస్ట్ ఇందులో నటించారు. ఈ ఈవెంట్ లో మీడియా అడిగిన చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు డైరెక్టర్ రవి కుమార్ సీరపు, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఇచ్చిన ఆన్సర్స్ సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేశాయి.
అసలు సినిమాలో హీరో లేడు, డైరెక్టర్ కొత్త, ముగ్గురు అమ్మాయిలతో ఇంత బడ్జెట్ పెట్టి సినిమా చేయడానికి నిర్మాతను ఏ పాయింట్ ఒప్పించింది అని మీడియా అడిగిన ప్రశ్నకు టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమాకి అసలైన హీరో కథ మాత్రమే అని, కేవలం కంటెంట్ నమ్మి మాత్రమే నిర్మాత ముందుకు వచ్చారని డైరెక్టర్ చెప్పారు. ఫేస్ వాల్యూ లేనప్పుడు జనాలు థియేటర్లకు ఎలా వస్తారు అన్న ప్రశ్నకు స్పందిస్తూ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
ఇలాంటి ఒక ఫ్రెష్ పాయింట్ ఇప్పటివరకు మన తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా రాలేదని డైరెక్టర్ చాలా గట్టిగా చెప్పారు. అదే తమ ఫస్ట్ గ్యారెంటీ అని, అందుకే ఈ ప్రాజెక్ట్ మీద అంత నమ్మకంతో ఉన్నామని వివరించారు. ఇకపోతే అసలు ఆ రెడ్ బ్యాగ్ లో ఏముంది అనేది మాత్రం ముందే చెబితే కిక్ ఉండదని, అది స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిన సస్పెన్స్ అని నవ్వేశారు.
పోస్టర్ లో నలుగురు అమ్మాయిలు ఉంటే స్టేజ్ మీద ముగ్గురే ఎందుకు ఉన్నారని అడిగిన ప్రశ్నకు స్నేహ అనే అమ్మాయి వేరే అవుట్ డోర్ షూటింగ్ లో ఉండటం వల్ల రాలేకపోయిందని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఇది రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదని, ఎమోషన్స్ యాక్షన్ తో నిండిన పక్కా యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పారు. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చిందని కన్ఫర్మ్ చేశారు.
కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ గురించి నిర్మాత హరికృష్ణ మాట్లాడుతూ రేపటి నుంచే రిలీజ్ ప్లాన్స్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. తమ బ్యానర్ పేరు మెమరీ మేకర్స్ అని ఎందుకు పెట్టారంటే ఆడియన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి మెమరీస్ లాంటి సినిమాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పేరు డిసైడ్ చేశామని ఆయన చాలా క్లియర్ గా వివరించారు.
అసలు కథ ఏంటంటే నలుగురు అమ్మాయిల జీవితాల్లోకి అనుకోకుండా ఒక రెడ్ బ్యాగ్ రావడం, ఆ తర్వాత వాళ్ల లైఫ్ ఎలాంటి టర్న్స్ తీసుకుంది, దాన్ని పంపిన విలన్ ఎవరు అన్నదే మెయిన్ పాయింట్. ఇక ఈ జనరేషన్ కు ఈ సినిమా ఎలా కనెక్ట్ అవుతుందని హీరోయిన్లను అడిగితే ఇది ఒక పోరాటం, బలానికి సంబంధించిన కథ అని వాళ్లు చాలా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇచ్చారు. మొత్తానికి ఈ ఇంటరాక్షన్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది.
