ఆడియన్స్ ఆ అతినే కోరుకుంటున్నారు
సినీ ఇండస్ట్రీలందు తెలుగు సినీ ఇండస్ట్రీ వేరు. టాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్, ఇక్కడ జరిగే హంగామా, ఫ్యానిజం, ఫ్యాన్ వార్స్ మరెక్కడా జరగవు.
By: Sravani Lakshmi Srungarapu | 24 Nov 2025 3:00 PM ISTసినీ ఇండస్ట్రీలందు తెలుగు సినీ ఇండస్ట్రీ వేరు. టాలీవుడ్ లో జరిగే ఈవెంట్స్, ఇక్కడ జరిగే హంగామా, ఫ్యానిజం, ఫ్యాన్ వార్స్ మరెక్కడా జరగవు. ప్రతీదీ చాలా భారీ స్థాయిలోనే ఉంటుంది. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ నటులున్నారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే నటీనటులున్నారు. తమ తమ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తూ నటీనటులు తమ క్రేజ్ ను ఎప్పటికప్పుడు పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే టాలీవుడ్ లోని నటీనటుల యాక్టింగ్ గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇప్పటికే గొప్పగా చెప్తూ వచ్చారు. ఫలానా నటుడు ఫలానా సినిమాలో చాలా బాగా నటించాడనో, ఫలానా మూవీలో ఫలానా యాక్టర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మ్ చేశాడనో చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఎంతోమంది చెప్పగా, టాలీవుడ్ లో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న రవిబాబు టాలీవుడ్ యాక్టర్ల గురించి వారి యాక్టింగ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. .
ఓవరాక్షన్ చేస్తేనే మంచి పేరు
తెలుగు సినిమాల్లో సీన్ కు సంబంధం లేకుండా ఓవరాక్షన్ చేస్తేనే వావ్, ఏం యాక్టింగ్ చేశాడ్రా అని మెచ్చుకుంటారని, చాలా మందికి ఇలానే సంబంధం లేకుండా పేరొచ్చిందని, తన విషయానికే వస్తే తాను ఎన్నో సినిమాల్లో చాలా బాగా నటించానని, మురారి మూవీలో ఓవరాక్షన్ చేస్తూ పిచ్చి పిచ్చి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చానని, కానీ మురారి సినిమాలో యాక్టింగ్ చూశాకే అందరూ మనకు భలే యాక్టర్ దొరికాడురా అని తనను పొగిడారని, టాలీవుడ్ లో ఓవరాక్షన్ చేసే వాళ్లనే ఆడియన్స్ బెస్ట్ గా గుర్తిస్తున్నారని కామెంట్స్ చేశారు రవిబాబు.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఒకరినొకరు పొగుడుకోవడం, అక్కడికి వచ్చిన ఆడియన్స్ ను అరిసేలా చేయడం, ఒక్కొక్కరి గురించి ఎలివేషన్లు ఇవ్వడం, స్టేజ్ మీదకు వచ్చే వాళ్లకు ఏం చేయాలో కూడా తెలియకపోవడం, వారిని యాంకర్లు గైడ్ చేయడం, మొత్తానికి ఈ ఈవెంట్స్ బాగా అసహనాన్ని కలిగించడమే అవుతుందని రవిబాబు కామెంట్స్ చేశారు. రవిబాబు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
