Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా హీరోల‌పై ర‌విబాబు షాకింగ్ స్టేట్మెంట్‌!

ప్ర‌స్తుతం తాను న‌టించి రూపొందించిన మూవీ `రేజ‌ర్‌`లో హీరోది మ‌ధ్య వ‌య‌సు క్యారెక్ట‌ర్‌. దీని కోసం ఫిజిక‌ల్‌గా, బ‌లంగా, త‌న‌లా న‌టించే వ్య‌క్తి ఎవ‌రూ దొర‌క‌లేదు అన్నారు.

By:  Ravindar Gorantla   |   28 April 2026 6:32 PM IST
పాన్ ఇండియా హీరోల‌పై ర‌విబాబు షాకింగ్ స్టేట్మెంట్‌!
X

విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ర‌విబాబు విభిన్న‌మైన పాత్ర‌ల‌ల్లో న‌టిస్తూనే స‌రికొత్త త‌ర‌హా క‌థ‌ల‌ని ఎంచుకుంటూ డైరెక్ట‌ర్‌గా సినిమాలు చేశారు. త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. చిన్న బ‌డ్జెట్‌లో సినిమాలు తీస్తూ ఓ ద‌శ‌లో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ర‌విబాబు ఓ ప‌క్క క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూనే అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైలి సినిమాల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. హీర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `అవును`, `అమ‌రావ‌తి` వంటి సైకో కిల్ల‌ర్ పాథ్‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

ఏదైనా విష‌యంపై నిర్మొహ‌మాటంగా మాట్లాడే ర‌విబాబు కొంత విరామం త‌రువాత ఓ విల‌క్ష‌ణ‌మైన స్టోరీతో రూపొందిన థ్రిల్ల‌ర్ `రేజ‌ర్‌`తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. మే 8న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో ఓ మీడియాతో మాట్లాడుతూ ర‌విబాబు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. సినిమాల నిర్మాణం, మేకింగ్ కోసం తీసుకుంటున్న డేస్‌, ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన మార్పుల‌పై ర‌విబాబు మాట్లాడిన తీరు ఇండ‌స్ట్రీలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌స్తుతం తాను న‌టించి రూపొందించిన మూవీ `రేజ‌ర్‌`లో హీరోది మ‌ధ్య వ‌య‌సు క్యారెక్ట‌ర్‌. దీని కోసం ఫిజిక‌ల్‌గా, బ‌లంగా, త‌న‌లా న‌టించే వ్య‌క్తి ఎవ‌రూ దొర‌క‌లేదు అన్నారు. అందుకే ఆ క్యారెక్ట‌ర్‌ని తానే చేశాన‌ని చెప్పుకొచ్చారు. ఫైట్ సీన్లు, కిక్స్ నిజంగా ప‌ర్ఫార్మ్ చేశాన‌ని వెల్లించారు. ఈ సంద‌ర్భంగా పాన్ ఇండియా హీరోల‌పై ర‌విబాబు చేసిన వ్యాఖ్య‌లు షాక్ కు గురి చేస్తున్నాయి. అభిమానుల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర లేపుతున్నాయి.

పాన్ ఇండియా హీరోల గురించి మాట్లాడుతూ ర‌విబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాన్ ఇండియా మూవీల్లో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో 90 శాతం మంది ఫైట్స్ కోసం డూప్‌ల‌నే వ‌డ‌తార‌ని తెలిపారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంట‌ర‌న్నారు. ప్ర‌స్తుతం ర‌విబాబు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై స్టార్ హీరోల అభిమానులు ఎలా రియాక్ట్ అవుతార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.