Begin typing your search above and press return to search.

ఆ టైమ్ ఇస్తే ఏ వెధ‌వైనా సినిమా తీస్తాడు!

`బాహుబ‌లి` త‌రువాత టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా సినిమాల మేకింగ్‌, బ‌డ్జెట్, వ‌ర్కింగ్ డేస్‌ల‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి.

By:  Ravindar Gorantla   |   29 April 2026 1:00 AM IST
ఆ టైమ్ ఇస్తే ఏ వెధ‌వైనా సినిమా తీస్తాడు!
X

`బాహుబ‌లి` త‌రువాత టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా సినిమాల మేకింగ్‌, బ‌డ్జెట్, వ‌ర్కింగ్ డేస్‌ల‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకున్నాయి. అంతా పాన్ ఇండియా సినిమాల వెంట ప‌డుతుండ‌టంతో వాటి మేకింగ్ అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్‌గా మారింది. ఒక్కో మూవీని రామ్ గోపాల్ వ‌ర్మ‌, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి డైరెక్ట‌ర్స్ ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కానీ 24 వ‌ర్కింగ్ డేస్‌లో తీసిన సినిమాలున్నాయి. అయితే ఇప్పుడు ట్రెండు మారిపోయింది. ఒక్కో మూవీ కోసం రెండు మూడేళ్లు టైమ్ తీసుకుంటున్నారు.

పాన్ ఇండియా సినిమా నిర్మాణం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక్కో సినిమా మేకింగ్‌కు డైరెక్ట‌ర్‌ని బ‌ట్టి రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతోంది. అలా రూపొందిన సినిమాల్లో చాలా వ‌ర‌కు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లుగా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించాయి. అయితే సినిమాల మేకింగ్ కోసం డైరెక్ట‌ర్లు ఏళ్ల‌కు ఏళ్లు టైమ్ తీసుకోవ‌డంపై గ‌త కొంత కాలంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అలాంటి విమ‌ర్శే ద‌ర్శ‌కుడు, న‌టుడు ర‌విబాబు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

విభిన్న‌మైన క‌థ‌ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ అండ్ వ‌ర్కింగ్ డేస్‌తో సినిమాలు రూపొందించి మంచి విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా డైరెక్ట‌ర్‌గా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు ర‌విబాబు. కొంత విరామం త‌రువాత ఆయ‌న న‌టించి రూపొందించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రేజ‌ర్‌`. మే 8న రిలీజ్ కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ ర‌విబాబు సినిమా మేకింగ్‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

`అస‌లు సినిమా మేకింగ్ అంటే ఏంటీ? ..ఒక క‌థ‌ని ప్ర‌పోజ్ చేసిన బ‌డ్జెట్‌లో అనుకున్న టైమ్ పీరియ‌డ్‌లో చెప్ప‌డం. అన్ లిమిటెడ్ టైమ్ ఉన్న‌ప్పుడు ఏ వెద‌వ అయినా సినిమా తీస్తాడు. ఇలాంటి మోడ‌ల్‌ని ఏ హాలీవుడ్ స్టూడియో కూడా అంగీక‌రించ‌దు. ఇక్క‌డెందుకు చేస్తున్నారో తెలియ‌దు` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధంచిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ర‌విబాబు ఎవ‌రిని ఉద్దేశించి ఈ మాట‌లు అన్నారు? అనే చ‌ర్చ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోంది.

అంతే కాకుండా ర‌విబాబు ప్రొడ్యూస‌ర్స్‌, హీరోల‌పై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న హార్డ్ రియాలిటీ ఏంట‌న్న‌ది త‌న మాట‌ల్లో వ్య‌క్తం చేశారు. ఇండ‌స్ట్రీ చాలా మారింద‌ని, ప్రొడ్యూస‌ర్స్ న‌డిపించే ఇండ‌స్ట్రీగా ఒక‌ప్పుడుంది. కానీ ఇప్పుడు హీరోలు న‌డిపిస్తున్న ఇండ‌స్ట్రీగా మారింద‌న్నారు. ఒక‌ప్పుడు ప్రొడ్యూస‌ర్ అనేవాడు డైరెక్ట‌ర్‌, రైట‌ర్స్‌తో క‌లిసి ఆఫీస్‌లో కూర్చుని ఫిల్మ్ మేకింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యే వారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూస‌ర్స్ నుంచి రైట‌ర్స్ వ‌ర‌కు అంతా హీరోల భ‌జ‌న చేస్తున్నార‌ని షాక్ ఇచ్చారు. దీంతో ర‌విబాబు ఇంట‌ర్వ్యూ ఇప్పుడు నెట్టింట‌, ఇండ‌స్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.