'ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతా'.. పెళ్లి డేట్ పై రష్మిక ఇలా!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 4 Dec 2025 10:29 AM ISTస్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ లోని ప్రముఖ ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహ బంధంతో ఇద్దరూ ఒకటవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా రష్మిక వెళ్లి ఏర్పాట్లను కూడా చూసి వచ్చారని వినికిడి.
కానీ ఇప్పటి వరకు పెళ్లిపై.. కనీసం ఎంగేజ్మెంట్ పై కూడా అటు విజయ్ సైడ్ నుంచి... ఇటు రష్మిక సైడ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సీక్రెట్ గా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే రీసెంట్ గా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లి వార్తలపై స్పందించారు.
తాను ఆ రూమర్స్ ను ఖండించలేనని తెలిపిన రష్మిక.. ఇప్పుడే ధ్రువీకరించలేనని కూడా ఉన్నారు. కానీ తన పెళ్లి గురించి ఎప్పుడు.. ఎక్కడ చెప్పాలో, మాట్లాడాలో.. అప్పుడే మాట్లాడతానని చెప్పారు. కచ్చితంగా అందరితోనూ షేర్ చేసుకుంటానని తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేనని అన్నారు రష్మిక.
దీంతో రష్మిక కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎంగేజ్మెంట్ మ్యాటర్ తో పాటు ఫోటోలు కూడా లీక్ చేయని విజయ్, రష్మిక.. అనౌన్స్మెంట్ విషయంలో ఏదో స్పెషల్ ప్లాన్ చేసినట్లు ఉన్నారని చెబుతున్నారు. ఎప్పుడు చెబుతారో చూద్దామని కామెంట్లు పెడుతున్నారు.
అయితే టాలీవుడ్ లో విజయ్, రష్మిక కాంబినేషన్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. వారి కెమిస్ట్రీకి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. తొలిసారి వారిద్దరూ గీత గోవిందం మూవీ చేయగా.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అందరినీ ఆకట్టుకుని ఓ రేంజ్ లో సందడి చేసింది. విజయ్, రష్మిక కాంబినేషన్ అదుర్స్ అన్న ముద్ర అప్పుడే పడింది.
ఆ తర్వాత మళ్లీ డియర్ కామ్రేడ్ మూవీకి కలిసి విజయ్, రష్మిక పని చేశారు. అప్పుడు కూడా వారి కాంబోకి మంచి మార్కులే పడ్డాయి. కెమిస్ట్రీ అంటే అలా ఉండాలని చాలా మంది అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జోడీగా నటిస్తున్నారు. ఆ మూవీ రిలీజ్ కు ముందే.. రీల్ కపుల్ కాస్త రియల్ కపుల్ గా మారనుందని స్పష్టంగా తెలుస్తోంది.
