Begin typing your search above and press return to search.

మారువేషంలో కింగ్ డమ్ చూసిన టాప్ హీరోయిన్..!

ఐతే ఆమె మారువేషంలో వెళ్లి భ్రమరాంబ థియేటర్ లో కింగ్ డమ్ చూసిందట. ఈ విషయం నిర్మాత నాగ వంశీ చెప్పే వరకు ఎవరికీ తెలియదు.

By:  Ramesh Boddu   |   2 Aug 2025 11:49 AM IST
మారువేషంలో కింగ్ డమ్ చూసిన టాప్ హీరోయిన్..!
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ థియేటర్ లో సందడి చేస్తుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాడు. గురువారం రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకోగా బాక్సాఫీస్ దగ్గర దూకుడు చూపిస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాను ఒక టాప్ హీరోయిన్ మారు వేషంలో వెళ్లి మరీ సినిమా చూసిందట.

నాగ వంశీ చెబితే కానీ..

ఆ విషయాన్ని నిర్మాత నాగ వంశీ చెబితే కానీ ఎవరికీ తెలియదు. ఇంతకీ విజయ్ సినిమాను అంత సీక్రెట్ గా చూసిన హీరోయిన్ ఎవరో తెలుసా.. మన నేషనల్ క్రష్ రష్మికానే. విజయ్, రష్మిక ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనా అంటే ఏమో అది వాళ్లే చెప్పాలి. ఇక విషయంలోకి వస్తే విజయ్ కింగ్ డమ్ సినిమాను రష్మిక ముందు శ్రీరాములు థియేటర్ లో చూడాలని అనుకుందట. ఐతే క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టమవుతుందని వద్దన్నారట.

ఐతే ఆమె మారువేషంలో వెళ్లి భ్రమరాంబ థియేటర్ లో కింగ్ డమ్ చూసిందట. ఈ విషయం నిర్మాత నాగ వంశీ చెప్పే వరకు ఎవరికీ తెలియదు. హీరోలు, హీరోయిన్స్ పబ్లిక్ లో కనిపిస్తే చాలు అదో రకమైన హంగామా చేస్తారు. దాని వల్ల అనవసరమైన తొక్కిసలాట ఏర్పడుతుంది. పుష్ప 2 సినిమా టైం లో అలా జరిగిన తొక్కిసలాట వల్లే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఐతే మారువేషంలో వచ్చినా అది రిస్కే.

విజయ్ దేవరకొండకు రష్మిక పెద్ద ఫ్యాన్..

కానీ రష్మిక థియేటర్ కి వెళ్లొచ్చిన తర్వాత అది తెలిసింది కాబట్టి ఏం కాలేదు. విజయ్ దేవరకొండకు రష్మిక పెద్ద ఫ్యాన్ అని అన్నారు నాగ వంశీ. విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఐతే కింగ్ డమ్ కి పాజిటివ్ టాక్ రాగానే రష్మిక తన సోషల్ మీడియాలో మనం కొట్టినం అంటూ ట్వీట్ చేసింది. దానికి విజయ్ కూడా మనం కొట్టినం అంటూ రిప్లై ఇచ్చాడు.

మొత్తానికి విజయ్ సినిమా హిట్ కొడితే మనం హిట్ కొట్టాం విజయ్ అని చెప్పింది అంటే వాళ్ల మధ్య మ్యాటర్ ఏ రేంజ్ లో వెళ్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా కింగ్ డం సినిమా భ్రమరాంబ లో రష్మిక మారువేషంలో చూసింది అన్న మ్యాటర్ తెలిసినప్పటి నుంచి ఆడియన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు.