Begin typing your search above and press return to search.

రష్మిక సోలో కాదు.. విజయ్ తోనే..

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ చిల్ అవుతుంటారన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   16 Aug 2025 3:02 PM IST
రష్మిక సోలో కాదు.. విజయ్ తోనే..
X

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పటికప్పుడు వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ చిల్ అవుతుంటారన్న విషయం తెలిసిందే. చేతి నిండా సినిమాలు ఉన్నా.. క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నా.. చిన్న గ్యాప్ వచ్చినా వెకేషన్స్ కు వెళ్తుంటారు. ఎప్పటికప్పుడు ఆమె ఎయిర్ పోర్ట్ కు వచ్చిన/ వెళ్లిన విజువల్స్ వైరల్ అవుతుంటాయి.

అదే సమయంలో రష్మిక ఎయిర్ పోర్ట్ లో కనిపించిన కాసేపటికే స్టార్ హీరో విజయ్ దేవరకొండ కనిపిస్తుంటారు. ఇద్దరూ కలిసి వెళ్తారో.. లేక అక్కడ వెళ్లాక కలుస్తారో తెలియదు. కానీ వెంట వెంటనే ఎయిర్ పోర్ట్ లో దర్శనమిస్తుంటారు. అయితే రీసెంట్ గా ఫారిన్ వెళ్లారు రష్మిక. ఆ తర్వాత విజయ్ మాత్రం కనిపించలేదు.

ఎందుకోనని అంతా ఆలోచిస్తే.. ఆయన రీసెంట్ గా ఓ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. దీంతో రష్మిక సింగిల్ గానే వెళ్లారు. అయితే వెళ్లడం ఒక్కరే గానీ.. ఇప్పుడు విజయ్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తాజాగా అమెరికాలో దర్శనమిచ్చారు.

అమెరికాలోని న్యూయార్క్ లో జరగనున్న ఇండియా డే పరేడ్ లో పాల్గొనున్నారు. కో- గ్రాండ్ మార్షల్స్ గా వ్యవహరించనున్నారు. ఆ విషయాన్ని ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్- ఎఫ్ఐఏ నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు విజయ్.. రష్మికను కలవడానికి చాలా చిన్న గ్యాప్ మాత్రమే ఇచ్చారని చెప్పాలి.

అదే సమయంలో విజయ్, రష్మిక డేటింగ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దానిపై వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ.. అంతా ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే విజయ్, రష్మిక పరోక్షంగా వెల్లడిస్తూనే ఉన్నారు. తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. స్పై జోనర్ లో అన్నదమ్ముల కథతో రూపొందించిన ఆ సినిమాతో మెప్పించారు. అదే సమయంలో రష్మిక ఇటీవల కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇప్పుడు అనేక సినిమాల్లో నటిస్తున్నారు. వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.