ఆ ఇద్దరి విషయంలో ఇలా తగులుకున్నారేంట్రా!
నెట్టింట ట్రోలింగ్ అన్నది సర్వ సాధారణంగా మారిన అంశం. ఇలాంటి ట్రోలింగ్ నుంచి ఎంతటి వారైనా తప్పించు కోలేరు అనడానికి ఎంతో మంది సెలబ్రిటీలను ఉదహరించొచ్చు.
By: Srikanth Kontham | 25 Jan 2026 11:00 PM ISTనెట్టింట ట్రోలింగ్ అన్నది సర్వ సాధారణంగా మారిన అంశం. ఇలాంటి ట్రోలింగ్ నుంచి ఎంతటి వారైనా తప్పించు కోలేరు అనడానికి ఎంతో మంది సెలబ్రిటీలను ఉదహరించొచ్చు. అమితాబచ్చన్ ,చిరంజీవి లాంటి లెజెండరీ నుంచి అంతా ట్రోలింగ్ బారిన పడ్డావారే. తాజాగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా? బోల్డ్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీ అంశాలు తెర మీదకొస్తున్నాయి. వీరిద్దరిని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వింత చర్చ నడుస్తోంది.'యానిమల్' తో ఫేమస్ అయిన త్రిప్తీ డిమ్రీని రష్మికమందన్నాతో పోల్చుతూ నెటి జనులు ఓ విశ్లేషణ్ చేస్తున్నారు.
వీరిద్దిరి కెరీర్ గ్రాఫ్, వ్యక్తిగత విషయాల్లో చాలా పోలికలు ఉన్నాయి అంటూ కొన్ని ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో చర్చలు మొదలయ్యాయి. విరీద్దిరు కెరీర్ ఆరంభంలో వారు పని చేసిన నిర్మాతలతో లవ్ లో పడ్డారు? అనే పాత విషయాన్నిగుర్తు చేసి ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. రష్మికా మందన్నా తన తొలి చిత్రం 'కిరిక్ పార్టీ'లో హీరోగా నటించిన రక్షిత్ తో నటించింది. ఆ సినిమాకు రక్షిత్ హీరోగానూ పని చేసాడు. తొలి సినిమాతోనే అమ్మడు రక్షిత్ తో ప్రేమలో పడటం..ఇద్దరి మధ్య కొన్నాళ్ల పాటు సీరియస్ లవ్..అటుపై రష్మిక తెలుగులో సక్సెస్ అయిన అనంతరం మరొకర్ని లవ్ చేయడం..బాలీవుడ్ జర్నీ ఇదంతా తెలిసిందే.
త్రిప్తీ డిమ్రీ కూడా తొలి సినిమా 'బుల్బుల్ చిత్ర నిర్మాత ,అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మతో ప్రేమలో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో? కర్ణేష్ తన సోషల్ మీడియా నుండి త్రిప్తికి సంబంధించిన ఫోటోలను తొలగించడమే కాకుండా, ఆమెను తన ప్రొడక్షన్ హౌస్ నుండి బ్లాక్ చేసాడు. ఇలా నటీమణులు ఇద్దరు నిర్మాతలతో ఆరంభంలో ప్రేమ నడిపి సక్సెస్ అయన అనంతరం దూరం అయిన వైనాన్ని గుర్తు చేస్తూ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు.
ఇద్దరు కెరీర్ ఎదుగుదల కోసమే ఇలా చేసారంటూ కొందరు పోస్టులు పెడుతుండగా వారి అభిమానులు వాటిని ఖండిస్తున్నారు. ఈ విషయంలో హీరోయిన్ల తప్పు ఎంత ఉందో? అటువైపు నుంచి అంతే తప్పు ఉందంటున్నారు.సినిమా ఇండస్ట్రీలో ఎవరితోనైనా ప్రేమలో పడటం, విడిపోవడం అనేది సహజమని, కేవలం మహిళా నటులనే ఇలా టార్గెట్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్మిక, త్రిప్తీలిద్దరు కెరీర్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. రష్మిక.. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, త్రిప్తి దిమ్రి బిజినెస్‌మెన్ సామ్ మర్చంట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
