Begin typing your search above and press return to search.

రష్మిక ప్లేస్ కోసం ఆ ఇద్దరి మధ్య ఫైట్..?

రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తున్న అమ్మడు ప్రతి సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా చేస్తుంది.

By:  Ramesh Boddu   |   30 Oct 2025 4:00 PM IST
రష్మిక ప్లేస్ కోసం ఆ ఇద్దరి మధ్య ఫైట్..?
X

రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తున్న అమ్మడు ప్రతి సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా చేస్తుంది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే థామా, ది గర్ల్ ఫ్రెండ్ లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా చేస్తుంది రష్మిక. నేషనల్ వైడ్ గా టాప్ రేంజ్ లో దూసుకెళ్తున్న రష్మిక ప్లేస్ ని ఆక్యుపై చేయాలని మిగతా హీరోయిన్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో రష్మిక ప్లేస్ కి ఇద్దరి భామల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ఆ ఇద్దరిలో ఎవరు ఆ ప్లేస్ కు వస్తారన్నది చర్చ నడుస్తుంది.

పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి ధమాకాతో హిట్టు కొట్టి..

రష్మికలానే చలాకీగా ఉంటూ ఆడియన్స్ తో మంచి ఇంటరాక్షన్ కొనసాగిస్తుంది శ్రీలీల. పెళ్లిసందడితో ఎంట్రీ ఇచ్చి ధమాకాతో హిట్టు కొట్టి గుంటూరు కారం, భగవంత్ కేసరి అంటూ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది అమ్మడు. శ్రీలీలకు ఉన్న ప్లస్ పాయింట్ డాన్స్ లు అదరగొట్టేస్తుంది. రష్మిక కూడా అదే రేంజ్ లో డాన్స్ చేస్తుంది. అంతేకాదు క్యూట్ లుక్స్ లో రష్మికకు ఏమాత్రం తీసిపోదు శ్రీలీల. ఐతే తను ఎంచుకున్న రోల్స్ తో ఇంకాస్త బలంగా ఇంపాక్ట్ చూపించాల్సి ఉంది శ్రీలీల.

రష్మికకు మరో ఆప్షన్ గా మారాలని చూస్తుంది బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్స్. మిస్టర్ బచ్చన్ తో మొదలైన అమ్మడి టాలీవుడ్ ప్రయాణం ఒక్క హిట్టు లేకపోయినా కూడా అమ్మడి క్రేజ్ సూపర్ గా ఉంది. కింగ్ డం మీద చాలా హోప్స్ పెట్టుకున్న భాగ్య శ్రీ ఆ సినిమా తో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. ఐతే ఆంధ్రా కింగ్ తాలూకాతో తెలుగులో తొలి సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. అదే జరిగితే మాత్రం భాగ్య శ్రీకి మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

రష్మిక ప్లేస్ పై గురి..

ఐతే శ్రీలీల, భాగ్య శ్రీ ఇద్దరు కూడా రష్మిక ప్లేస్ పై గురి పెట్టారు. రష్మిక సినిమాల ఎంపికను చూసి వాళ్లు కూడా అదే తరహాలో సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఐతే ఈ ఇద్దరిలో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇద్దరు రష్మిక ప్లేస్ లో కాదు ఆమె రేంజ్ కి వెళ్తారని చెప్పడంలో సందేహం లేదు.

రష్మికకు ఈ ఇద్దరితోనే కాదు కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా మరో త్రెట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే నేషనల్ క్రష్ ట్యాగ్ రష్మిక నుంచి రుక్మిణికి ఇచ్చేస్తున్నారు. ఇక అమ్మడు మరో రెండు మూడు సినిమాలు చేస్తే రుక్మిణి పూర్తిగా రష్మికని ఓవర్ టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఇలా హీరోయిన్స్ కొత్త స్టార్స్ రాగానే పాత వాళ్లు సైడ్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఐతే ఉన్న వారిలో ఎవరికి ఆ ఛాన్స్ దక్కుతుంది ఎవరు టాప్ చెయిర్ అందుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.