క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రష్మిక!
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత చేత రష్మిక కాదు పాన్ ఇండియా క్రష్మిక అని పిలిపించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.
By: Madhu Reddy | 28 Oct 2025 11:38 AM ISTరష్మిక మందన్న.. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత చేత రష్మిక కాదు పాన్ ఇండియా క్రష్మిక అని పిలిపించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. తన అందం తోనే కాదు అద్భుతమైన పర్ఫామెన్స్ తో కూడా అందరిని మెప్పించింది రష్మిక. పాత్ర ఏదైనా సరే డీ గ్లామరస్ పాత్ర మొదలుకొని మహారాణి పాత్ర వరకు ఇలా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అలా తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈమె .. ఇటు సోషల్ మీడియాలో కూడా అలరిస్తూ అభిమానులకు చేరువవుతోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది రష్మిక. అందులో థామా మూవీకి సంబంధించిన బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ధరించి కళ్ళకు మస్కారా వేసుకుంటున్నట్లు సెల్ఫీ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరొక ఫోటోలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చుడిదార్ లో దర్శనమిచ్చి కళ్లద్దాలు పెట్టుకొని మరీ కనిపించింది ఇంకొక ఫోటోలో కొంటెగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇలా వరుసగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రష్మిక అందానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.
రష్మిక విషయానికి వస్తే.. ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి భారీ పాపులర్ కి సొంతం చేసుకుంది..అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశానందుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఆచితూచి అడుగులు వేస్తూ పలు సక్సెస్ లను అందుకుంటోంది. ఇక గత మూడు నాలుగు సంవత్సరాలుగా పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, థామా అంటూ వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ మధ్యలో సల్మాన్ ఖాన్ తో సికందర్ అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా డిజాస్టర్ అయినా.. దీని ప్రభావం పెద్దగా రష్మిక కెరియర్ పై పడలేదు అని చెప్పవచ్చు.
ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేసింది. నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అందులో రష్మిక నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అటు సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీక్షిత్ శెట్టి హీరోగా, రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.మొత్తానికైతే రష్మికకు మహర్దశ పట్టింది అని చెప్పడంలో సందేహం లేదు.
