Begin typing your search above and press return to search.

'ది గర్ల్ ఫ్రెండ్'.. వీకెండ్ బుకింగ్స్ జోరు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' నిన్న (నవంబర్ 7) థియేటర్లలోకి వచ్చింది.

By:  M Prashanth   |   8 Nov 2025 10:42 AM IST
ది గర్ల్ ఫ్రెండ్.. వీకెండ్ బుకింగ్స్ జోరు!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' నిన్న (నవంబర్ 7) థియేటర్లలోకి వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'పుష్ప', 'యానిమల్' వంటి భారీ చిత్రాల తర్వాత రష్మిక నుంచి వస్తున్న పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామా కావడంతో, ఈ సినిమాపై యూత్‌లో మొదటి నుంచి ప్రత్యేక ఆసక్తి నెలకొంది.





ఇక మొదటి రోజు కంటే సినిమా రెండో రోజు బుకింగ్స్ లో మెల్లగా గ్రోత్ చూపిస్తోంది. రెండో రోజైన శనివారం ఆన్‌లైన్ బుకింగ్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో ఈ సినిమా 'ట్రెండింగ్' లిస్ట్‌లో కొనసాగుతోంది. సినిమా పేజీపై యూజర్ల నుంచి మంచి యాక్టివిటీ కనిపిస్తుండటం, టికెట్ సేల్స్ పెరుగుతుండటం గమనార్హం.

ఈ ఆన్‌లైన్ ట్రెండ్‌ను బలపరుస్తూ, 'బుక్ మై షో'లో గత 24 గంటల్లోనే 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాకు ఏకంగా 34.55 వేలకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడవ్వడం చూస్తుంటే, వీకెండ్ కోసం ఆడియన్స్ ఈ సినిమాను బెస్ట్ ఆప్షన్‌గా చూస్తున్నారని అర్ధమవుతుంది.

ఈ బుకింగ్స్ ట్రెండ్ ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై (తెలుగు వెర్షన్) వంటి మెట్రో నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో బలంగా కనిపిస్తోంది. ఇది రెగ్యులర్ రొటీన్ మసాలా సినిమా కాకుండా, డిఫరెంట్ లవ్ డ్రామా కావడంతో, మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి సినిమాకు మద్దతు లభిస్తున్నట్లు ఈ ఆన్‌లైన్ సేల్స్ తో అర్ధమవుతుంది.

ఒక సినిమా 'ట్రెండింగ్'లో ఉండటం, గంట గంటకూ టికెట్ల అమ్మకాలు పెరగడం అనేది ఆ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిందనడానికి అసలు ఉదాహరణ. మొదటి రోజు టాక్‌తో సంబంధం లేకుండా, వీకెండ్ ఎంజాయ్‌మెంట్ కోసం ఫ్యామిలీస్, యూత్ ఈ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, ఈ శనివారం ఆన్‌లైన్ బుకింగ్స్‌లో 'ది గర్ల్ ఫ్రెండ్' మంచి జోరు చూపిస్తోంది. ఇదే ట్రెండ్ ఈరోజు సాయంత్రం షోలకు, అలాగే రేపు ఆదివారం కూడా కొనసాగితే, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించే అవకాశం బలంగా కనిపిస్తోంది.