Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్ కు చెప్పకుండా.. పాట కోసం కోటి!

రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి.

By:  M Prashanth   |   2 Nov 2025 12:20 PM IST
అల్లు అరవింద్ కు చెప్పకుండా.. పాట కోసం కోటి!
X

రష్మిక మందన్న నటిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. నవంబర్ 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ అండగా ఉండటంతో, బజ్ గట్టిగానే ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల వెనుక ఒక పెద్ద కథ నడిచింది. నిర్మాత ధీరజ్ మొగిలినేని, కేవలం ఒక ప్రమోషనల్ సాంగ్ కోసం ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ విషయం ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే.. లిరికల్ వీడియోల దగ్గర. "ఇప్పుడు లిరికల్ వీడియోలు అన్నీ ఒకే ఫార్మాట్‌లో, రొటీన్‌గా ఉంటున్నాయి" అని ఫీల్ అయిన ధీరజ్, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకున్నారట. 'బేబీ' సినిమా టైమ్‌లో పాటలను స్పెషల్‌గా షూట్ చేసిన అనుభవంతో, 'ది గర్ల్‌ఫ్రెండ్'కు కూడా లిరికల్ వీడియో కాకుండా, ఒక పూర్తి వీడియో సాంగ్‌ను షూట్ చేసి రిలీజ్ చేద్దామని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కు ఐడియా ఇచ్చారు. రాహుల్ కూడా వెంటనే ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు.

ఐడియా అయితే ఇచ్చారు కానీ, ఆ తర్వాత జరిగిన ప్లానింగ్, బడ్జెట్ చూసి ఆయనే షాక్ అయ్యారు. "షూట్‌కు రెండు రోజుల ముందు నాకు బడ్జెట్ షీట్ పంపారు. అది చూసి షాక్ అయ్యాను" అని ధీరజ్ చెప్పారు. ఆ బడ్జెట్ మొత్తం కోటి రూపాయలు. కేవలం ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కే 50 లక్షలు అయ్యిందని చూసి కళ్లు తిరిగాయట.

కోటి రూపాయలు అని తెలియగానే ఆపేయొచ్చు కదా? అంటే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. "ఆల్రెడీ 10 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. కొరియోగ్రాఫర్లను చెన్నై నుంచి పిలిపించారు. అన్నింటికంటే ముఖ్యంగా, రష్మిక మందన్న బాంబే నుంచి ఫ్లైట్‌లో వచ్చి డాన్స్ రిహార్సల్స్ కూడా మొదలుపెట్టేశారు". అంతా రెడీ అయ్యాక, ఇప్పుడు ఆపితే మొత్తం లాస్ అవుతామని, వెనక్కి తగ్గలేకపోయారట.

"ఇది నాదే మిస్టేక్. ఒక ప్రమోషనల్ సాంగ్‌కు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం బ్లండర్ బూతు" అని ధీరజ్ నవ్వేశారు. "ఏదైతే అది అయింది, పాట హిట్టయితే ఈ ఖర్చు ఎవరికీ గుర్తుండదులే" అనే కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్లానని చెప్పారు. ఈ కోటి రూపాయల విషయం అల్లు అరవింద్ గారికి కూడా చెప్పకుండా చాలా రోజులు దాచిపెట్టానని, కానీ ఫైనల్‌గా ఆయనకు తెలిసిపోయిందని ధీరజ్ ఆ ఫన్నీ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు.

సినిమా రిలీజ్‌కు ముందే ఒక పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేయడం అనేది పెద్ద రిస్క్. సినిమాలోని పాటకే ఎవరూ ఇంత పెట్టరు. అలాంటిది ప్రమోషన్ కోసం ఇంత పెట్టారంటే, మేకర్స్ సినిమాపై ఎంత ప్యాషన్‌తో ఉన్నారో అర్థమవుతోంది. మరి, ఈ కోటి రూపాయల పాట, సినిమాకు ఏ రేంజ్ బజ్ తెస్తుందో, ఆ ఖర్చును జస్టిఫై చేస్తుందో లేదో చూడాలి.